రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌.. ఒకే ప్లాన్‌లో అధిక ప్రయోజనాలు

Reliance General Insurance Newly Launched Health Infinity Policy Benefits Discounts - Sakshi

హైదరాబాద్‌: రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘రిలయన్స్‌ హెల్త్‌ ఇన్ఫినిటీ’ పేరుతో ప్రీమియం ఉత్పత్తిని విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో అపరిమిత కవరేజీ సదుపాయం ఉంటుందని సంస్థ తెలిపింది. రూ.5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చని, మేటరి్నటీ కవరేజీ, అంతర్జాతీయ కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్‌ (సమ్‌ ఇన్సూరెన్స్‌ అయిపోతే పునరుద్ధరించడం), 15 వరకు యాడాన్‌ ప్రయోజనాలు ఉన్నట్టు సంస్థ ప్రకటించింది.

ఆర్థికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వారికి రివార్డులు ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన వారికి, శారీరక వ్యాయామాలతో ఆరోగ్యకర బీఎంఐను నిర్వహిస్తున్న వారికి రివార్డులు అందించనుంది. ఓపీడీ కన్సల్టేషన్‌ చార్జీలకు సైతం కవరేజీ ఉంది. అలాగే, ఒక్కటే క్లెయిమ్‌ సమ్‌ ఇన్సూరెన్స్‌ దాటినప్పుడు నూరు శాతం అదనపు కవరేజీ లభిస్తుంది. హాస్పిటల్‌ రూమ్‌ల విషయంలో పరిమితులు కూడా లేవు. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top