
ఇండియా ఫార్మాస్యూటికల్ లాజిస్టిక్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా.. డీపీ వరల్డ్, హైదరాబాద్‌లో మొట్టమొదటి స్పెషల్ రీఫర్ రైలు (Reefer Rail)ను ప్రారంభించింది. తిమ్మాపూర్ (Thimmapur) నుంచి నవా షెవా (Nhava Sheva) మధ్య దీని సేవలను అందిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తరలించాల్సిన వస్తువులను.. ఈ రీఫర్ రైలు ద్వారా సరఫరా చేస్తారు. ఫార్మా ఎగుమతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వారానికి ఒకసారి మాత్రమే ప్రయాణించే ఈ రైలులో 43 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్‌లు ఉంటాయి. ఇది నెలకు నాలుగుసార్లు ప్రయాణిస్తుంది. స్పెషల్ ట్రైన్ ప్రారంభించడం వల్ల.. 43 ట్రక్కుల అవసరం తగ్గడం మాత్రమే కాకుండా.. రోడ్డుపై రద్దీ కూడా కొంత తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు కూడా 70 శాతం వరకు తగ్గుతాయి.
ప్రతి కంటైనర్ ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండటం కోసం.. కావలసిన ఏర్పాట్లను చేశారు. సాంకేతిక నిపుణులు దీనిని పర్యక్షిస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా వస్తువులను సురక్షితంగా గమ్యం చేర్చవచ్చు.