రంగులు మార్చే రియల్‌మి ఫోన్‌ | realme unveils World First Cold-sensitive color-changing phone | Sakshi
Sakshi News home page

రంగులు మార్చే రియల్‌మి ఫోన్‌

Jan 21 2025 4:27 AM | Updated on Jan 21 2025 7:46 AM

realme unveils World First Cold-sensitive color-changing phone

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్‌ రియల్‌మి పరిశ్రమలోనే తొలిసారిగా ఉష్ణోగ్రతలను బట్టి రంగు మార్చే కోల్డ్‌ సెన్సిటివ్‌ రియల్‌మి 14 ప్రో 5జీ, 14 ప్రో ప్లస్‌ 5జీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఉష్ణోగ్రత 16 డిగ్రీల కన్నా దిగువకు పడిపోతే ఇవి ఒక దాన్నుంచి మరో రంగులోకి, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పూర్వ రంగులోకి మారతాయి. ఆఫర్‌ కింద 14 ప్రో 5జీ ఫోన్ల ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది. 

14 ప్రో ప్లస్‌ 5జీ ఫోన్లలో డీఎస్‌ఎల్‌ఆర్‌ స్థాయి సోనీ ఐఎంఎక్స్‌896 ఓఐఎస్‌ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌ 3 చిప్‌సెట్, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ మొదలైనవి ఉంటాయి. వీటి ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్లపై నిర్దిష్ట డిస్కౌంట్లు లభిస్తాయి. 14 ప్రో సిరీస్‌ 5జీ ఫోన్ల విక్రయం జనవరి 23 నుంచి మొదలవుతుంది. అటు వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ 5 ఏఎన్‌సీ ఉత్పత్తులను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,599గా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement