త్వరలో.. భారత్‌లో రియల్‌మీ 12 సిరీస్‌ విడుదల, ధర ఎంతంటే? | Realme 12 Pro, Realme 12 Pro Plus Likely To Launch In India Soon - Sakshi
Sakshi News home page

త్వరలో.. భారత్‌లో రియల్‌మీ 12 సిరీస్‌ విడుదల, ధర ఎంతంటే?

Published Mon, Dec 11 2023 3:31 PM

Realme 12 Pro, Realme 12 Pro plus Likely To Launch In India Soon - Sakshi

చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లో మిడ్‌ రేంజ్‌ రియల్‌ మి 12 సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ జీటీ 5 ప్రో సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఇతర స్మార్ట్‌ఫోన్‌లైన వన్‌ప్లస్‌ 12 తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. 

ఈ తరుణంలో భారత్‌లో సైతం ఇతర స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలకు ధీటుగా రియల్‌మీ కంపెనీ మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లను మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తుందంటూ ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ గిజ్మోచైనా నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా రియల్‌మీ ప్రో, రియల్‌మీ ప్రో ప్లస్‌ ఫోన్‌లను లాంచ్‌ చేయనుందని సమాచారం. 

రియల్‌మీ 12ప్రో ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే?
రియల్‌మీ 12 ప్రో క్వాల్కమ్‌ 7 4ఎన్‌ఎం ప్రాసెస్‌ జనరేషన్‌ 3 చిప్‌సెట్‌తో రానుంది. దీంతో పాటు 2ఎక్స్‌ ఆప్టికల్స్‌ జూమ్‌ చేసేలా 32 ఎంపీ ఐఎంఎక్స్‌ 709 టెలిఫోటోలెన్స్‌ సైతం ఈ ఫోన్‌లో ఉన్నాయి. అదే విధంగా రియల్‌మీ 12ప్రో ప్లస్‌ 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో  64 ఎంపీ ఓమ్నీవిజన్‌ ఓవీ64బీ లెన్స్‌ సపోర్ట్‌ను అందిస్తుంది. 

రియల్‌మీ 12 సిరీస్‌ ధరలు 
రియల్‌మీ 12ప్రో 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌తో రూ.25,000గా ఉంది. మొదట వచ్చే ఏడాది మార్చి లోపు ఈ ఫోన్‌ విడుదల చేసి.. ఆ తర్వాత గ్లోబుల్‌ మార్కెట్‌ యూజర్లకు పరిచయం చేస్తుంది. ఈ గ్లోబుల్‌ మార్కెట్‌లో భారత్‌ సైతం ఉంది. ఇక రియల్‌మీ 12 సిరీస్‌కి పోటీగా రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను న్యూయర్‌కి విడుదల చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.

చదవండి👉 కొనుగోలు దారులకు బంపరాఫర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం భారీ డిస్కౌంట్‌కే..

Advertisement
 
Advertisement