RBI Imposes Rs 1 Crore Penalty On Union Bank, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Union Bank Of India: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు భారీ పెనాల్టీ..! ఎందుకంటే..

Nov 29 2021 9:07 PM | Updated on Nov 30 2021 10:33 AM

RBI Imposes Rs 1 Crore Penalty On Union Bank Of India - Sakshi

RBI Imposes Penalty On Union Bank: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) గట్టి షాకిచ్చింది.ఒత్తిడితో కూడిన ఆస్తుల విక్రయం, ఫ్రాడ్‌ కేసులను వర్గీకరించడంలో లోపాలతో పాటుగా మరికొన్ని నిబంధనలను పాటించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సోమవారం(నవంబర్‌ 29)న   కోటి రూపాయల జరిమానా విధించింది. 

రెగ్యులేటరీ సమ్మతిలో భాగంగా బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందాలను బహిర్గత పరచడానికి వీలు లేదు. ఈ విషయంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను ఉల్లఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019కు సంబంధించిన  స్టాట్యూటరీ ఇన్‌స్పెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్‌ను ఆర్బీఐ నిర్వహించింది.  

2019 ఐఎస్‌ఈ సంబంధిత కరస్పాండెన్స్‌లు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఉన్నప్పటికీ రెడ్ ఫ్లాగ్ ఖాతాలను వర్గీకరించడంలో, సెక్యూరిటీ రెసిపట్ల ప్రొవిజనింగ్‌ను బహిర్గతం చేయడంలో   యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వైఫల్యం చెందినట్లు ఆర్బీఐ పేర్కొంది. దీనికి అనుగుణంగా ఆర్బీఐ ఆదేశాలను పాటించనందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఫైన్‌ను విధించింది. అంతేకాకుండా బ్యాంకుకు ఎందుకు జరిమానా విధించకూడదో కారణం చూపాలని  ఆర్బీఐ నోటీసు జారీ చేసింది.
చదవండి: ఎస్‌బీఐకు ఆర్బీఐ భారీ పెనాల్టీ! ఎంత? ఎందుకంటే..

Advertisement
 
Advertisement
Advertisement