‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’ | RBI Deputy Governor Viral Acharya Cautions Against GDP Comparisons | Sakshi
Sakshi News home page

గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

Published Tue, Mar 12 2024 3:01 PM | Last Updated on Tue, Mar 12 2024 3:02 PM

RBI Deputy Governor Viral Acharya Cautions Against GDP Comparisons - Sakshi

భారతదేశం తన జీడీపీ వృద్ధిని ఇతర దేశాలతో పోల్చకూడదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య అన్నారు. అలా గొప్పలు చెప్పి సరిపెట్టే బదులుగా ఉద్యోగాలను సృష్టించేందుకు దృష్టి సారించాలని తెలిపారు.

భారతదేశంలో చాలా మందికి ఒక విచిత్రమైన అలవాటు ఉందన్నారు. మన వృద్ధి రేటును ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చడం కంటే, కొత్త కార్మిక శ్రామికశక్తి కోసం ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. యూట్యూబ్‌లోని ది గ్లోబల్ ఇండియన్స్‌కు చెందిన పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఫిర్యాదులు! సమస్య పరిష్కారం కావాలంటే..

‘భారత్‌ తన జీడీపీ వృద్ధి రేటును ఇతర దేశాలతో పోల్చుకుని, మిన్నగా ఉందంటూ సంబరపడటం సరికాదు. వాస్తవానికి మన దేశంలో ఉపాధి కల్పనకు అవసరమైన వృద్ధి సాధనపై దృష్టినిలపాలి. జాబ్స్‌ మార్కెట్లో ప్రవేశిస్తున్నవారికి ఉద్యోగాల సృష్టి కోసం అవసరమైన వృద్ధి రేటుపై ఆలోచించాలి. కానీ మిగతా ప్రపంచంతో పోల్చుకుని ఉపయోగం లేదు. భారత్‌ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అని హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement