రణ్‌బీర్‌ ఆలియాల పెళ్లి.. బ్రాండ్‌ ప్రమోషన్లలో కార్పోరేట్‌ కంపెనీలు బిజీ.. | Ranbir Alia Wedding : Corporate Companies Brand Promotion | Sakshi
Sakshi News home page

రణ్‌లియా పెళ్లి.. విషెస్‌ ప్రమోషన్లలో కార్పోరేట్‌ కంపెనీలు..

Apr 15 2022 2:02 PM | Updated on Apr 15 2022 2:34 PM

Ranbir Alia Wedding : Corporate Companies Brand Promotion - Sakshi

గత రెండు రోజులుగా ఇటు సోషల్‌ మీడియాలో అటు మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో రణ్‌బీర్‌ ఆలియా పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు పనిలో పనిగా బ్రాండ్‌ ప్రమోషన్‌లో పడ్డాయి కార్పోరేట్‌ కంపెనీలు.

- నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన తమషా, ఆలియ్‌ భట్‌ నటించి డియర్‌ జిందగి సినిమాలను కోట్‌ చేస్తూ.. డియర్‌ జిందగీ మా ప్రేమ జీవితానికి సంబంధించిన తమాషా ముగిసింది, ఇక షాదీ లైఫ్‌లోకి ఎంటర్‌ అవుతున్నాం అంటూ శుభాకాంక్షలు తెలిపింది.


- స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ సినిమా ద్వారా ఆలియాభట్‌ వెండితెరకు ఎంట్రీ ఇవ్వగా రాకెట్‌సింగ్‌ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ సేల్స్‌మాన్‌ రోల్‌ పోషించాడు. ఈ రెంటిండిటి ముడి పెడుతూ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌, సేల్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌లకు వివాహ శుభాకాంక్షలు జొమాటో తెలిపింది.


- స్విగ్గీ సైతం ఇదే తరహాలో కొత్త దంపతులను పప్పన్నంతో పోలిక పెడుతూ శుభాకాంక్షలు తెలిపింది.

చదవండి: ఆ విషయంలో రణ్‌బీర్‌పై ఆలియాదే పైచేయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement