ఈ నెల 31న ఐపీవో షురూ
రూ. 680 కోట్ల సమీకరణపై కన్ను
న్యూఢిల్లీ: పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 546–575 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 31న ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 28న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా పెర్నియాస్ పాపప్ షాప్ మాతృ సంస్థ రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 680 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
మల్టీబ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ ఓమ్నీ చానల్ ప్లాట్‌ఫామ్ నిర్వాహక కంపెనీ ఐపీవో నిధులలో రూ. 371 కోట్లు సొంత అనుబంధ సంస్థ పీఎస్‌ఎల్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. వీటిని ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల లీజ్ చెల్లింపులతోపాటు.. దేశీయంగా బ్యాకెండ్ ఆఫీసుల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 139 కోట్లు సేల్స్, మార్కెటింగ్ వ్యయాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
లిస్టింగ్‌లో కంపెనీ విలువ రూ. 4,600 కోట్లుగా నమోదయ్యే వీలుంది. కంపెనీ రిటైల్‌గా పెరి్నయాస్ పాపప్ షాప్‌ల ద్వారా సంప్రదాయ దుస్తులు, వ్యక్తిగత విలాసవంత వస్తువులు తదితరాలను విక్రయిస్తుంది. కంపెనీలో ఇప్పటికే సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, సచిన్ తెండూల్కర్, మహేష్ బాబు తదితరులు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం!


