పబ్జి గ్లోబల్ వెర్షన్ లో సరికొత్త ఫీచర్స్ | PUBG Mobile Lite Global Version New 0 20 0 Update | Sakshi
Sakshi News home page

పబ్జి మొబైల్ లైట్ గ్లోబల్ వెర్షన్ లో సరికొత్త ఫీచర్స్

Dec 24 2020 2:27 PM | Updated on Dec 24 2020 2:39 PM

PUBG Mobile Lite Global Version New 0 20 0 Update - Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో లక్షల మంది పబ్జి అభిమానులు దేశంలో పబ్జి మొబైల్ గేమ్ తిరిగి ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పబ్జి అభిమానులకు శుభవార్త అందించింది గేమింగ్ కంపెనీ. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. బాగా జనాదరణ పొందిన పబ్జి మొబైల్ లైట్ యొక్క 0.20.0 గ్లోబల్ వెర్షన్ అప్‌డేట్ కొద్దీ వారాల క్రితం విడుదల అయినట్లు పేర్కొంది. ఈ అప్‌డేట్ లో భాగంగా తీసుకొచ్చిన 
కొత్త ఫీచర్లను పరీక్షించడానికి ఆసక్తి చూపే గేమింగ్ లవర్స్ పబ్జి మొబైల్ లైట్ ఏపీకే లింక్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా పరీక్షించవచ్చు. ఏపీకే వెర్షన్ కోసం మాత్రం మీ మొబైల్ లో 575 ఎంబీ స్పేస్ మాత్రం ఉండాలి.(చదవండి: ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్)

పబ్జి మొబైల్ లైట్ 0.20.0 లేటెస్ట్ వెర్షన్ లో యూనివర్సల్ మార్క్ ఫీచర్, వింటర్ కాజిల్ వంటి అనేక కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు మాత్రం మీ మొబైల్ లో ట్యాప్‌టాప్ స్టోర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్‌టాప్ స్టోర్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నాక పీయుబిజీఎమ్ లైట్ లేదా పబ్జి మొబైల్ లైట్ కోసం సెర్చ్ బార్ లో టైపు చేయండి. ఇప్పుడు మీరు పబ్జి మొబైల్ లైట్ 0.20.0 లేటెస్ట్ వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారతదేశంలో పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ నిషేదించారు కాబట్టి ఇండియన్ పబ్జి గేమింగ్ లవర్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. 

భారతీయ మార్కెట్లోకి పబ్జి గేమ్ ని తిరిగి తీసుకురావడం కోసం కంపెనీ అధికారులు భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుత పరిస్థితులలో పబ్జి గేమ్ ని తిరిగి తీసుకురావడం అంత సులభం అయ్యేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు మాత్రం తెలుస్తుంది. మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్జిని దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భద్రతా పరంగా మన దేశంలో నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుండి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement