రిలయన్స్ జియో చేతికి పబ్‌జీ

PUBG Corp, Reliance Jio in talks to bring back PUBG Mobile - Sakshi

ఇరు సంస్థల మధ్య ప్రాథమిక చర్చలు

సాక్షి, న్యూఢిల్లీ : నిషేధిత పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జీనిభారతీయ వినియోగదారులకు తిరిగిఅందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ టెలికాం విభాగం జియోతో పబ్‌జీ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని,  ఇరు సంస్థలు కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తుచేస్తున్నాయి. దీనికి సంబంధిన ఒప్పంద  సాధ్యాసాధ్యాలను లీగల్ టీం పరిశీలిస్తోంది. ప్రధానంగా రెండు అంశాలపై దృష్టినట్టు సమాచారం. మొదటిది  50:50 వాటాలు, రెండవది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు ఆదాయాన్ని చెల్లించడం. రిలయన్స్ గేమింగ్ మార్కెట్లోకి  రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. 

పబ్‌జీని దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. ఇండియాలో దీనిపై నిషేధం విధించడంతో చైనాకంపెనీనుంచి బ్లూహోల్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకుంది. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో పబ్‌జీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జియో రంగంలోకి దిగింది. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  కాగా ఇటీవల కరోనా వైరస్ సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ ప్రకారం పలు చైనా యాప్లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్జీని కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top