విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి

PM Narendra Modi video message in G-20 meeting of Trade and Investment Ministers, Jaipur - Sakshi

జీ20 వాణిజ్య మంత్రుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ  

జైపూర్‌: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్‌ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్‌ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌(ఓఎన్‌డీసీ) అనేది ఒక గేమ్‌–చేంజర్‌ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్‌ మార్కెట్‌ప్లేస్‌ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top