
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో నూతన సూపర్‌బైక్స్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వీటిలో అప్రీలియా ఆర్‌ఎస్ 660, టూవోనో 660, అప్రీలియా ఆర్‌ఎస్‌వీ4, టూవోనో వీ4, మోటో గుజ్జి వీ85టీటీ ఉన్నాయి.
ధరలు రూ.13.09 లక్షల నుంచి రూ.23.69 లక్షల వరకు ఉంది. మోటోప్లెక్స్ డీలర్‌షిప్స్ వద్ద ఇవి లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉందని కంపెనీ తెలిపింది.
ధర 660 సీసీ అప్రీలియా ఆర్‌ఎస్ 660 రూ.13.39 లక్షలు, టూవోనో 660 రూ.13.09 లక్షలు, 1078 సీసీ ఆర్‌ఎస్‌వీ4 రూ.23.69 లక్షలు, 1077 సీసీ టూవోనో వీ4 రూ.20.66 లక్షలు, 850 సీసీ మోటోగుజ్జి వీ85టీటీ రూ.15.4 లక్షలు ఉంది.