ఫోన్‌పేకు ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌

PhonePe gets IRDAI license to serve as direct insurance broker - Sakshi

న్యూఢిల్లీ: చెల్లింపుల సేవల్లోని ప్రముఖ కంపెనీ ఫోన్‌పే.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నుంచి బీమా బ్రోకింగ్‌ లైసెన్స్‌ లభించినట్టు సోమవారం ప్రకటించింది. కార్పొరేట్‌ ఏజెంట్‌ లైసెన్స్‌తో బీమా వ్యాపారంలోకి ఫోన్‌పే గతేడాదే ప్రవేశించింది. నిబంధనల కింద ఒక్కో విభాగంలో మూడు కంపెనీలతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఉంటుంది. కానీ, ఇప్పుడు నేరుగా బ్రోకింగ్‌ లైసెన్స్‌ లభించడంతో అన్ని బీమా కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసే అనుమతులు లభించినట్టయింది. దీంతో బీమా బ్రోకింగ్‌ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ సంస్థకు 30 కోట్లకుపైగా యూజర్ల బేస్‌ ఉంది. భారీ సంఖ్యలోనున్న యూజర్లకు బీమా ఉత్పత్తులను ఆఫర్‌ చేయగలదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top