6 వేల మందిపై ‘ఫిలిప్స్’ కంపెనీ వేటు...కారణం ఇదే

Philips Slash 6,000 More Jobs Worldwide After Massive Recall Of Faulty Sleep Respirators - Sakshi

ప్రముఖ  వైద్య ప‌రిక‌రాల సంస్థ ఫిలిప్స్ వరల్డ్‌ వైడ్‌గా వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో రాయ్ జాక‌బ్స్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

మూడు నెలల ముందు ఫిలిప్స్‌ సంస్థ 4వేల మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది. తాజాగా సిబ్బందికి పింక్‌ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు జాకబ్స్‌ తెలిపారు. ఇది క‌ష్ట‌త‌ర‌మైన స‌మ‌యం, కానీ తప్పడం లేదంటూ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. 2025 నాటికి వర్క్‌ ఫోర్స్‌ను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 3వేల మందిని, 2025 నాటికి మొత్తం 6వేల మందిని తొలగిస్తామని అన్నారు.  ఫిలిప్స్ సంస్థ నిద్రలేమని సమస్యతో బాధపడే వారి కోసం స్లీప్ రెస్పిరేట‌ర్లను చేసింది. వాటి వల్ల

వినియోగదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ రెస్పిరేటర్లను రీకాల్‌ చేసింది. వెరసీ ఫిలిప్స్ కంపెనీ గ‌త ఏడాది క్యూ4లో సుమారు 114 మిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టాన్ని చ‌విచూసింది. గ‌త ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియ‌న్ల యూరోలు నష్ట‌పోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top