రెండో రోజూ పెట్రో సెగ | Petrol, diesel prices continue to rise | Sakshi
Sakshi News home page

రెండో రోజూ పెట్రో సెగ

Jan 23 2021 9:59 AM | Updated on Jan 23 2021 3:24 PM

 Petrol, diesel prices continue to rise - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  అంతర్జాతీయంగా చమురు ధరలు  భగ్గుమనడంతో  వరుసగా రెండో రోజుకూడా  దేశీయంగా  పెట్రోధరలు  పెరిగాయి.  శనివారం ఇంధన ధరలను మరో 25 పైసలు పెంచాయి.   నిన్న లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున  వడ్డించిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో  ఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి.  హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90 కి  చేరువ కావడం, అమరావతిలో 92   స్తాయిని టచ్‌ చేయడంంగమనార్హం.  (పెట్రో ధరలు భగ్గు)

దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.70కు, డీజిల్‌ ధర రూ.75.88
ముంబైలో పెట్రోల్‌ రూ. 92.28, డీజిల్‌ రూ.82.66

చెన్నైలో పెట్రోల్‌ లీటరుకు రూ.88.38, డీజిల్‌ రూ.82.23
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.87.11, డీజిల్‌ రూ.79.48

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 89.15  డీజిల్ ధర రూ. 82.80
అమరావతిలో పెట్రోల్‌ రూ. 91.94 డీజిల్‌ రూ.85.10

Advertisement
 
Advertisement
Advertisement