రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలకే ఎక్కువ పెట్టుబడులు | PE and VC investments reach 42 per cent in2022 May | Sakshi
Sakshi News home page

రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలకే ఎక్కువ పెట్టుబడులు

Jun 17 2022 1:42 PM | Updated on Jun 17 2022 1:42 PM

PE and VC investments reach 42 per cent in2022 May - Sakshi

ముంబై: దేశీయంగా గత నెలలో పీఈ, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 2021 మే నెలతో చూస్తే 42 శాతం ఎగసి 5.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే ఈ  ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 7.5 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 29 శాతం క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం డీల్‌ పరిమాణం భారీగా పెరిగింది.

గతేడాది మేలో నమోదైన 66 నుంచి 109కు డీల్స్‌ సంఖ్య ఎగసింది. ఈ ఏప్రిల్‌లో మాత్రం ఇంతకంటే అధికంగా 117 లావాదేవీలు జరిగాయి. 2022 మే నెలలో ప్రధానంగా రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలు అధిక పెట్టుబడులను సాధించాయి. 1.7 బిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ నమోదయ్యాయి. ఇక 10 కోట్ల డాలర్ల విలువైన 14 భారీ డీల్స్‌ సైతం మే నెలలో జరిగాయి. వీటి మొత్తం విలువ 3.9 బిలియన్‌ డాలర్లుకాగా.. అపోలో గ్లోబల్‌ నుంచి అదానీ గ్రూప్‌ నిర్వహణలోని ముంబై ఎయిర్‌పోర్ట్‌ సమీకరించిన 75 కోట్ల డాలర్లు వీటిలో కలసి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement