పేటీఎం ఈ–కామర్స్‌ ఇక పాయ్‌ ప్లాట్‌ఫామ్స్‌

Paytm E-commerce renamed as Pai Platforms - Sakshi

న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్‌ పేరు పాయ్‌ ప్లాట్‌ఫామ్స్‌గా మారింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న రిజి్రస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి ఆమోదం లభించిందని సంస్థ శుక్రవారం తెలిపింది. పేటీఎం ఈ–కామర్స్‌లో ఎలివేషన్‌ క్యాపిటల్‌కు మెజారిటీ వాటా ఉంది.

పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మతోపాటు సాఫ్ట్‌ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడి చేశాయి. అలాగే ఓఎన్‌డీసీ వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోబిట్స్‌ సొల్యూషన్స్‌ (బిట్సిలా) అనే కంపెనీని పేటీఎం ఈ–కామర్స్‌ కొనుగోలు చేసినట్టు సమాచారం. 2020లో బిట్సిలా కార్యకలాపాలు ప్రారంభించింది. ఓఎన్‌డీసీలో టాప్‌ –3 సెల్లర్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది.   

నిబంధనలు పాటించడంపై కమిటీ: పేటీఎం
అసోసియేట్‌ పేమెంటు బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిబంధనల పాటింపు, నియంత్రణపరమైన వ్యవహారాలపై తగు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేటీఎం బ్రాండు మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తెలిపింది. దీనికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్‌ ఎం దామోదరన్‌ నేతృత్వం వహిస్తారని వివరించింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్‌ ఎంఎం చితాలే, ఆంధ్రా బ్యాంక్‌ మాజీ సీఎండీ ఆర్‌ రామచంద్రన్‌ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top