Sakshi News home page

ప్యాసింజర్‌ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!

Published Fri, Apr 14 2023 7:33 AM

Passenger vehicle sales in india fy23 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్‌సేల్‌లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ వన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్‌ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు.

యుటిలిటీ వాహనాలు..
గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్‌ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి.

సానుకూలంగా పరిశ్రమ.. 
అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్‌ ప్యాసింజర్‌ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్‌ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్‌ స్కటర్లు 27 శాతం, మోటార్‌సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్‌ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు. 

Advertisement
Advertisement