breaking news
Vehicle sales financial year
-
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్‌సేల్‌లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ వన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు. యుటిలిటీ వాహనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి. సానుకూలంగా పరిశ్రమ.. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ స్కటర్లు 27 శాతం, మోటార్‌సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
వాహనాలు.. టాప్ గేర్!
♦ ఏప్రిల్‌లో మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా జోరు ♦ టూవీలర్ అమ్మకాలు కూడా రయ్.. రయ్ న్యూఢిల్లీ: వాహన విక్రయాలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల(ఏప్రిల్)లో జోరుగా సాగాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా సహా పలు కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ అమ్మకాలు మాత్రం పతనమయ్యాయి. టూవీలర్ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ కంపెనీ, టీవీఎస్ మోటార్ కంపెనీల విక్రయాలు కూడా బాగా పెరగ్గా బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి. తక్కువ బేస్ ఎఫెక్ట్ (గత ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు తక్కువ స్థాయిలో ఉండడం), కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేవడం, పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో వాహన విక్రయాలు జోరుగా సాగాయని విశ్లేషకులంటున్నారు. ఇదే జోరును కొనసాగిస్తామని పలు కంపెనీలు పేర్కొన్నాయి. వివరాలు.. ♦ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ప్రీమియం కార్లు- సియాజ్, బాలెనో, విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్‌ల అమ్మకాలు బాగా ఉన్నాయని మారుతీ సుజుకి ఇండియా ఈడీ, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఈ కార్లకు డెలివరీ చేసే కాలాన్ని(వెయిటింగ్ పీరియడ్)ను తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు మూడు రెట్లు, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 8 శాతం చొప్పున పెరిగాయని, మిని సెగ్మెంట్ కార్ల విక్రయాలు 10 శాతం తగ్గాయని పేర్కొనారు. ♦ డీజిల్ వాహనాలు, గ్రామీణ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, కార్ల విక్రయాల్లో 10 శాతం వృద్ధి సాధించామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. క్రెటా, ఇలీట్ ఐ20, గ్రాండ్ మోడళ్లు మంచి అమ్మకాలు సాధించాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ♦ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ అమ్మకాలు 14% పెరిగాయి. ఇదే జోరును కొనసాగించగలమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్)ప్రవీణ్ షా చెప్పారు. ఢిల్లీలో డీజిల్ వాహనాల నిషేధంపై ఈ నెల 9న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు.. దేశ పారిశ్రామిక వృద్ధిలో వాహన పరిశ్రమ పాత్రను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ♦ మెట్రో నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా రెనో క్విడ్ కారుకు అద్భుతమైన స్పందన లభిస్తోందని రెనో ఇండియా సీఈఓ, ఎండీ సుమీత్ సాహ్ని పేర్కొన్నారు. ♦ వినియోగదారుల అభిరుచులకనుగుణమైన వాహనాలను అందిస్తున్నామని, అందుకే పరిశ్రమ కన్నా మంచి విక్రయాలు సాధించామని ఫోర్డ్ ఇండియా ఈడీ అనురాగ్ మెహరోత్ర చెప్పారు. ♦ ఇక టూవీలర్ సెగ్మెంట్ విషయానికొస్తే, హీరో మోటోకార్ప్ అమ్మకాలు 27 శాతం, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా విక్రయాలు 27 శాతం, యమహా అమ్మకాలు 66 శాతం, టీవీఎస్ మోటార్ అమ్మకాలు 16 శాతం చొప్పున పెరగ్గా, బజాజ్ ఆటో విక్రయాలు మాత్రం 2 శాతం తగ్గాయి.