రూ.3.7 కోట్ల జాబ్.. AI భవిష్యత్తుపై అలర్ట్! | OpenAI Is Offering Rs 3 7 Crore For A Job To Stop AI From Becoming Too Smart | Sakshi
Sakshi News home page

రూ.3.7 కోట్ల జాబ్.. AI భవిష్యత్తుపై అలర్ట్!

May 24 2026 4:47 PM | Updated on May 24 2026 5:26 PM

OpenAI Is Offering Rs 3 7 Crore For A Job To Stop AI From Becoming Too Smart

ఓపెన్ఏఐ కంపెనీ.. ఏఐ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. తాజాగా.. సంస్థ ప్రకటించిన ఒక ప్రత్యేక ఉద్యోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి దాదాపు 4,45,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.7 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు సమాచారం.

ఓపెన్ఏఐ ప్రకటించిన ఈ జాబ్ సాధారణ AI అభివృద్ధికి సంబంధించినది కాదు. భవిష్యత్తులో ఏఐ మనుషుల సహాయం లేకుండానే తనను తాను మరింత తెలివిగా మార్చుకుంటే.. ఏమవుతుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో భాగం. ఈ ఉద్యోగం ప్రిపేర్డ్‌నెస్ సేఫ్టీ టీమ్‌లో భాగం.

ప్రిపేర్డ్‌నెస్ సేఫ్టీ టీమ్‌ అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికి ఎలాంటి ప్రమాదాలు కలిగించవచ్చో.. ముందుగానే అంచనా వేసి వాటికి రక్షణ మార్గాలు రూపొందిస్తుంది.

ఈ ఉద్యోగ ప్రకటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు కేవలం సాంకేతికంగా బలంగా ఉండడమే కాకుండా.. వ్యూహాత్మక ఆలోచన, సరైన తీర్పు వంటివి కలిగి ఉండాలని సంస్థ స్పష్టంగా వెల్లడించింది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే.. ప్రస్తుతం లేని, భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల గురించి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.

ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement