GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్‌లో రచ్చ రచ్చ

No GST On Papad Whatever Its Shape Clarified By CBIC - Sakshi

అప్పడాలపై జీఎస్టీ ఉందా? ఉంటే ఏ రకమైన అప్పడాలపై జీఎస్టీ ఉంది ? వేటికి మినహాయింపు ఉందనే అంశంపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. చివరకు కేంద్రమే ఈ చర్చలో జోక్యం చేసుకోవాల్సి  వచ్చింది. 

పాపడ్‌పై జీఎస్‌టీ
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ఇటీవల ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అందులో గుండ్రంగా ఉన్న పాపాడ్‌ (అప్పడం), చతురస్రాకారంలో ఉన్న అప్పడాల ఫోటోలను షేర్‌ చేశారు. ఇందులో గుండ్రటి అప్పడాలకు జీఎస్‌టీ మినహాయింపు ఉందని, చతురస్రాకారపు అప్పడాలకు జీఎస్‌టీ విధిస్తున్నారు ? ఇందులో లాజిక​ ఏముంది ? ఎవరైనా చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ సందేహానికి బదులివ్వాలంటూ అడిగారు. 

చర్చకు దారి తీసిన ట్వీట్‌
హర్ష్‌గోయెంకా ట్వీట్‌పై పెద్ద ఎత్తన నెటిజన్లు స్పందించారు. గుండ్రటి అప్పడాలు చేతితో చేస్తారు కాబట్టి వీటికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉందని, చుతరస్రాకారపు అప్పడాలు మెషిన్‌ చేస్తారు కాబట్టి వాటికి జీఎస్‌టీ విధిస్తారంటూ చాలా మంది తమ అభిప్రాయం చెప్పారు. మరికొందరు చేతితో చేసే రౌండ్‌ షేప్‌ అప్పడాలు కుటీర పరిశ్రమ పరిధిలోకి వస్తాయని, స్క్వేర్‌ షేప్‌ అప్పడాలు భారీ పరిశ్రమ విభాగంలోకి వస్తాయంటూ స్పందించారు.

ప్రభుత్వంపై విమర్శలు
ఇక జీఎస్‌టీ చట్టం, అందులోని నిబంధనల జోలికి పోకుండా చాలా మంది నెటిజన్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పడాలు రెండు ఒకటై అయినా రౌండ్‌ వాటికి మినహాయింపు ఇచ్చి, స్క్వేర్‌ షేప్‌ వాటికి పన్ను వేయడం పనికి మాలిన నిర్ణయమంటూ దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. ట్వీట్‌ పోస్ట్‌ చేసి 24 గంటల గడవక ముందే వేలాది మంది దీనిపై స్పందించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు.

జీఎస్‌టీ మినహాయింపు
ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోవడంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగం స్పందించింది. పాపాడ్‌ (అప్పడం) ఎలాంటిదైనా సరే దానిపై ఎటువంటి జీఎస్‌టీ విధించడం లేదని ప్రకటించింది. పాపాడ్‌లను జీఎస్‌టీ నుంచి మినహాయించినట్టు పేర్కొంది. ఈ మేరకు హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేస్తూ బదులిచ్చింది. ఆల్కహాల్‌, పెట్రోలు ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయి. 

చదవండి : సామాన్యుడికి షాక్‌​.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర.. ఏడాదిలో ఐదోసారి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top