బోనస్‌ షేర్లు ప్రకటించిన ఎన్‌ఎండీసీ | NMDC announces 2 1 bonus issue | Sakshi
Sakshi News home page

బోనస్‌ షేర్లు ప్రకటించిన ఎన్‌ఎండీసీ

Nov 12 2024 7:30 AM | Updated on Nov 12 2024 7:30 AM

NMDC announces 2 1 bonus issue

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ 2:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు ప్రకటించింది. అంటే రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండు అదనపు షేర్లు జారీ చేస్తారు. అధీకృత మూలధన్నాన్ని రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలని సోమవారం సమావేశమైన బోర్డు నిర్ణయించింది.

సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో ఎన్‌ఎండీసీ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ.1,030 కోట్ల నుంచి రూ. 1,189 కోట్లకు ఎగసింది. పన్నుకు ముందు లాభం రూ.1,404 కోట్ల నుంచి రూ.1,614 కోట్లుగా ఉంది. వ్యయాలు రూ.2,931 కోట్ల నుంచి రూ.3,665 కోట్లను తాకాయి. ఈపీఎస్‌ రూ.3.50 నుంచి రూ.4.13కు పెరిగింది. టర్నోవర్‌ 22% అధికమై రూ.5,280 కోట్లు నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎండీసీ షేరు ధర బీఎస్‌ఈలో సోమవారం 1.15% క్షీణించి రూ.233 వద్ద స్థిరపడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement