Stock Market Updates Today: Nifty & Sensex Ended In Red On F And O Expiry - Sakshi
Sakshi News home page

తీవ్ర ఊగిసలాట; కోలుకున్నా చివరికి నష్టాలే

Jul 14 2022 3:35 PM | Updated on Jul 14 2022 9:21 PM

Nifty and Sensex ended in red on F and O expiry - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో కళకళలాడిన సూచీలు మిడ్‌ సెషన్‌ నుంచీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఎఫ్‌అండ్‌ఓ  సిరీస్‌  గడువు ముగింపు రోజు కావడంతో తీవ్ర ఓలటాలిటీ  మధ్య  కొనసాగాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో  అమ్మకాలు కొనసాగాయి. యూరోపియన్ మార్కెట్లలో బలహీన ధోరణుల మధ్య  ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బ్యాంకింగ్,  ఐటీ షేర్లు నష్టపోయాయి. 

తీవ్ర ఒడిదుడుకుల మధ్య  కొనసాగి చివరికి సెన్సెక్స్‌  98 పాయింట్లు నష్టాలకు పరిమితమై 53416 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 15938 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్ర, మారుతి సుజుకి, బ్రిటానియా, డా.రెడ్డీస్‌ లాభపడగా,హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరోమోటో కార్ప్‌,టెక్‌ మహీంద్ర, యాక్సిస్‌ బ్యాంకు, బీపీసీఎల్‌ నష్టపోయాయి.  అటు డాలరు మారకంలో రూపాయి పతనానికి అంతు లేకుండాపోతోంది.  79.87 వద్ద ఆల్‌ టైం కనిష్టానికి చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement