లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా ‘సహకార్‌’

NFTC To Launch New Transport Service Sahakar Taxi - Sakshi

ఓలా, ఉబర్‌కు పోటీగా సహకార్‌ ట్యాక్సీ

న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల రంగంలో దేశంలో ఓలా, ఉబర్‌ పెద్ద ఎత్తున చొచ్చుకుపోయాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో సంస్థ రాబోతోంది. లక్షలాది మందికి ఉపాధి లక్ష్యంగా సహకార్‌ ట్యాక్సీ పేరుతో నేషనల్‌ టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎఫ్‌టీసీ) సేవలను పరిచయం చేయబోతోంది. కొరియర్‌ సేవల రంగంలోకి సైతం ప్రవేశించనున్నట్టు ఫెడరేషన్‌ ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న ధరల కంటే చవకగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఎన్‌ఎఫ్‌టీసీ చైర్మన్‌ వి.వి.పి.నాయర్‌ వెల్లడించారు. అధిక ప్రయోజనం డ్రైవర్లకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించే సహకార్‌ ట్యాక్సీ ద్వారా కొన్నేళ్లలో 10 లక్షలకుపైగా మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్‌ఎఫ్‌టీసీ 2011 నుంచి సహకార రంగంలో సేవలు అందిస్తోంది. 

చదవండి: నితిన్‌ గడ్కారీ.. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌పై భవీశ్‌ ఏమన్నాడో విన్నావా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top