5G Spectrum Auction: 5జీ వేలం.. పోటీలో అంబానీ, అదానీ.. నువ్వా నేనాఅంటూ..

New Delhi: Auction For 5G Spectrum On July 26 - Sakshi

న్యూఢిల్లీ: 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్‌ చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేలం జరగనున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి.  బిడ్డర్ల వ్యూహాలు, రేడియో తరంగాలకు గల డిమాండ్‌ బట్టి వేలం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుందని వివరించాయి.

4జీతో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా ఉండే 5జీ సర్వీసులకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా పోటీపడుతోంది. చాలా మటుకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో కనీస ధరకే బిడ్లు రావచ్చని, వేలం రెండు రోజుల పాటు జరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చదవండి: Ford: భారీ షాక్‌.. భారత్‌ నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top