Vijay Mallya Fined By SC: విజయ్ మాల్యాకు 2 వేల జరిమానా! మీమ్స్‌ వైరల్‌!

Netizens React After Supreme Court Imposed Fine Of Rs 2,000 On Vijay Mallya  - Sakshi

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్‌ మాల్యాకు కోర్టు 2వేల జరిమానా విధించిడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రూ.9వేల కోట్లకు పైగా రుణాల్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాకు కోర్టు విధించిన ఈ జరిమానా సరిపోదని అంటున్నారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరుతూ మీమ్స్‌ను షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవేంటే చూసేద్దాం.

కోర్టు దిక్కారం కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం..కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top