హైదరాబాద్‌లో నెస్లే బిజినెస్‌ సొల్యూషన్స్‌ జీసీసీ | Nestlé Business Solutions Hyderabad GCC Partners Genpact AI Automation | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నెస్లే బిజినెస్‌ సొల్యూషన్స్‌ జీసీసీ

Jul 7 2026 4:08 AM | Updated on Jul 7 2026 4:10 AM

Nestlé Business Solutions Hyderabad GCC Partners Genpact AI Automation

న్యూఢిల్లీ: స్విస్‌ కన్జూమర్‌ గూడ్స్‌ దిగ్గజం నెస్లేలో భాగమైన నెస్లే బిజినెస్‌ సొల్యూషన్స్‌ (ఎన్‌బీఎస్‌) హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ, ప్రాసెస్‌ సొల్యూషన్స్‌ సంస్థ జెన్‌ప్యాక్ట్‌తో కలిసి నెస్లే బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా దీన్ని నెలకొల్పనుంది.

కంపెనీ తన వ్యాపార సేవలను మరింత సరళంగా అందించేందుకు, నిర్దిష్ట ప్రమాణాలను పాటించేందుకు అవసరమైన ఆటోమేషన్, ఏఐ మొదలైన అంశాల్లో జెన్‌ప్యాక్ట్‌ తోడ్పాటు అందిస్తుంది. పటిష్టమైన టెక్నాలజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉండటంతో పాటు భారత్‌లో జీసీసీలకు హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు ఎన్‌బీఎస్‌ హెడ్‌ లూకా ఫిషెరా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement