First Time In Hyderabad 5 Varieties Of Natu Kodi Meat Available In Online - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో అమ్మకానికి నాటుకోడి.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో

Feb 12 2022 11:27 AM | Updated on Feb 12 2022 1:57 PM

 Natu kodi Meat Available In online First Time In Hyderabad - Sakshi

నాన్‌వెజ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌! ముఖ్యంగా చికెన్‌ని లొట్టలేసుకుంటే తినేవారికయితే ఇదీ ఎంతో నచ్చే విషయం. నిఖార్సైన నాటుకోడి మాంసం ఆర్డర్‌ వేస్తే చాలు మీ ఇంటికి వచ్చేస్తుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నాటుకోడి మాంసం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది కంట్రీ చికెన్‌ కో సంస్థ. ప్రస్తుతం మూడు సెంటర్ల నుంచి ఈ సంస్థ సేవలు అందిస్తోంది.

ఐదు రకాలు
కంట్రీ చికెన్‌ కో సంస్థ క్లాసిక్‌ ఆంధ్రా, టెండర్‌ తెలంగాణ, మైసూర్‌ క్వీన్‌, వారియర్‌, కడక్‌నాథ్‌ వెరైటీల్లో నాటుకోడి మాంసం అందిస్తోంది. పూర్తిగా సహాజ పద్దతుల్లో పెంచిన నాటుకోడి మాంసాన్నే విక్రయిస్తామని కంట్రీ చికెన్‌ కో హామీ ఇస్తోంది.

కేజీ ఎంతంటే
కంట్రీ చికెన్‌ కో వెబ్‌సైట్‌లో​ ఉన్న వివరాల ప్రకారం కేజీ మాంసానికి కడక్‌నాథ్‌ రూ. 909, క్రాసిక్‌ ఆంధ్రా రూ. 584, టెండర్‌ తెలంగాణ రూ. 487, మైసూర్‌ క్వీన్‌ రూ.552లుగా ఉంది. ఇందులో మైసూర్‌ క్వీన్‌ వెరైటీలో కోడిపెట్టెల మాంసం లభిస్తుంది. పూర్తిగా సహాజసిద్ధమైన ఆహారం ఈ కోళ్లకు అందిస్తున్నారు.

పందెం కోడి
కంట్రీ చికెన్‌ కో అందిస్తున్న నాటు కోడి మాంసం వెరీట్లో పందెం కోడి రకానికి చెందిన వారియర్‌ అత్యంత ఖరీదైనది. వారియర్‌ నాటుకోడి మాంసం కేజీ రూ.2599లగా ఉంది. ఈ వారియర్‌ రకం చికెన్‌ కోసం 1.9 కేజీ నుంచి 2.4 కేజీల బరువు ఉండే పంండె కోడిని మాంసం కోసం ఉపయోగిస్తారు. ఈ పందెం కోళ్లకు దానాగా బాదంపప్పు, జీడిపప్పు వంటివి ఖరీదైన డ్రైఫ్రూట్స్‌ అందిస్తారు. 

ఆర్డర్‌ చేస్తే చాలు
కంట్రీ చికెన్‌ కో వెబ్‌సైట్‌కి వెళ్లి నచ్చిన వెరెటీకి చెందిన చికెన్‌ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. బోయిగూడ, ప్రగతినగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లలో ఈ సంస్థకు బ్రాంచీలు ఉన్నాయి. అక్కడి నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సేవలు అందిస్తోంది.
 చదవండి: హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్‌ కొరియన్‌ మెనూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement