హైదరాబాద్‌లో ఇవి కూడానా? ఓపెన్‌ కొరియన్‌ మెనూ!

K Drama Popularity leads To Open A Korean Restaurant In Hyderabad - Sakshi

సరిగ్గా పదేళ్ల క్రితం ఓపెన్‌ గాంగ్నమ్‌ స్టైల్‌ అంటూ కొరియన్‌ పాప్‌ సింగర్‌ సై పాడిన పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆ తర్వాత యూట్యూబ్‌ వీడియోలతో బీటీఎస్‌ గ్యాంగ్‌కి ఇండియాలో ఫ్యాన్స్‌ ఏర్పడ్డారు. ఇక ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్‌ డ్రామాలకి మన దగ్గర సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఏర్పడింది. ఇప్పుడా ఫ్యాన్స్‌ కోసం మన భాగ్యనగరంలో కొరియన్‌ రెస్టారెంట్‌లో వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. 

హాలీవుడ్‌ సినిమాలు, పాప్‌ మ్యూజిక్‌ తర్వాత హంగ్‌బేస్డ్‌ నటులైన బ్రూస్‌లీ, జాకీచాన్‌లకే ఇండియాలో పెద్ద ఫ్యాన్‌బేస్‌ ఏర్పడింది. వారి తర్వాత జెట్‌లీ, టోనీజాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత కొరియన్‌ డ్రామాలు, కొరియన్‌ నటులను ఇండియన్లు సొంతం చేసుకుంటున్నారు. కే డ్రామాతో పాపులరైన కొరియన్‌ వెబ్‌ సిరీస్‌లకు యూత్‌లో యమా క్రేజ్‌ ఉంది. కే డ్రామాలో నటులు ఉపయోగించే గార్మెంట్స్‌, స్టైలింగ్‌ ఇప్పటికే కాలేజీ అమ్మాయిల్లో పాపులర్‌ అవ్వగా గత ఏడాది కాలంగా ఆ నటులు తాగే డ్రింక్స్‌, తినే ఫుడ్‌ ఐటమ్స్‌కి ఎంటైర్‌ యూత్‌లో డిమాండ్‌ పెరిగింది.

ఏకంగా రెస్టారెంట్‌
కే డ్రామాలకు ఉన్న ఫ్యాన్‌బేస్‌ని, యూత్‌లో ఉన్న క్రేజ్‌ని ఆధారం చేసుకుని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ కొరియన్‌ రెస్టారెంట్‌ ఓపెన్‌ అయ్యింది. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న చో మిన్‌ యున్‌ అనే కొరియన్‌ మహిళ గోగుర్యో పేరుతో ఈ రెస్టారెంట్‌ని మాదాపూర్‌లో ప్రారంభించింది.

భారీ మెనూ
గోగుర్యో రెస్టారెంట్‌లో ఫేమస్‌ కొరియన్‌ వంటకాలైన జాప్‌చో, బిబిమ్‌బాప్‌, కిమ్‌బాప్‌, రమ్‌యున్‌, కిమ్‌చీ ప్యాన్‌కేక్‌, గ్రిల్ల్‌డ్‌ మీట్‌ ఇలా పలు రకాలైన 11 పేజీలతో కూడి భారీ మెనూని అందిస్తోంది చో మిన్‌ యున్‌. ఒకేసారి 80 మంది వెళ్లి ఆస్వాదించేలా ఈ రెస్టారెంట్‌ని తీర్చిదిద్దారు. రెస్టారెంట్‌ వాల్స్‌పై బే సూజి లాంటి కొరియన్‌ స్టార్స్‌ పోస్టర్స్‌ చూస్తూ స్పీకర్లలో బీటీఎస్‌ మ్యూజిక్‌ని వింటూ నోరూరించే కొరియన్‌ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు హైదరాబాదీలు. 

బిర్యానీ ఒక్కటే కాదు 
కాస్మోపాటిలన్‌ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌ బిర్యానీకి ఫేమస్‌. ఆ తర్వాత సౌతిండియన్‌​ తాలిని అందించే హోటళ్లు  కోకొళ్లుగా ఉన్నాయి. వీటి తర్వాత ఇటాలియన్‌, మల్టీ క్యూజిన్‌ రెస్టారెంట్‌లు వచ్చాయి. ఆ తర్వాత రాయలసీమ రుచులు, పల్లె రుచులు, తెలంగాణ రుచులు పేరుతో దేశీ వంటకాలు కూడా ఫేమస్‌ అయ్యాయి. వాటా వ్యాపారం పుంజుకుంది. ఇక చైనీస్‌ రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులు గల్లీగల్లీకి వెలిశాయి. ఐనప్పటికీ కొరియన్‌ క్యూజిన్‌ జాడలు ఇప్పటి వరకు లేవు. కేవలం యూబ్యూబ్‌లో బీటీఎస్‌, ఓటీటీలో కే డ్రామాల మూలంగా స్థానికంగా ఏర్పడిన ఫ్యాన్‌ బేస్‌ కోసమే ఇప్పుడు కొరియన్‌ రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చింది.

చదవండి:ఈ ఫుడ్‌ డెలివరీ యాప్‌తో బరువు తగ్గుతారు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top