నాట్కో మధ్యంతర డివిడెండ్‌ | Natco Pharma net declines 23percent in Q3 on lower API | Sakshi
Sakshi News home page

నాట్కో మధ్యంతర డివిడెండ్‌

Feb 10 2023 6:03 AM | Updated on Feb 10 2023 6:03 AM

Natco Pharma net declines 23percent in Q3 on lower API - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా డిసెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం తగ్గి రూ.62 కోట్లు సాధించింది. టర్నోవర్‌ రూ.591 కోట్ల నుంచి రూ.513 కోట్లకు పడిపోయింది.

డిసెంబర్‌ త్రైమాసికానికి ఒక్కో షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నాట్కో షేరు ధర బీఎస్‌ఈలో గురువారం 0.38 శాతం క్షీణించి రూ.529.10 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement