రియల్టీ నుంచి ప్రభుత్వాలకు రూ.2 లక్షల కోట్లు | Sakshi
Sakshi News home page

రియల్టీ నుంచి ప్రభుత్వాలకు రూ.2 లక్షల కోట్లు

Published Sat, Sep 9 2023 5:08 AM

Naredco-Knight Frank - Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ పెద్ద ఆదాయ వనరుగా మారింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఈ పరిశ్రమ నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం స్టాంప్‌ డ్యూటీ, రిజి్రస్టేషన్‌ ఫీజు తదితర రూపంలో ప్రభుత్వాలకు సమకూరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ వాటా 5.4 శాతంగా ఉంది.

ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా’తో కలసి రియల్‌ ఎస్టేట్‌ కౌన్సిల్‌ ‘నరెడ్కో’ విడుదల చేసింది. ‘‘భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 12 రెట్లు పెరిగి 2047 నాటికి 5.8 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 477 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2047 నాటికి దేశ జీడీపీలో 15 శాతం వాటాను సమకూరుస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ వాటా జీడీపీలో 7.3 శాతంగా ఉంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 33–40 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది’’అని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది.  

నివాస మార్కెట్‌ 3.5 ట్రిలియన్‌ డాలర్లు
నివాస గృహాల మార్కెట్‌ పరిమాణం గత ఆర్థిక సంవత్సరం నాటికి 299 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 3.5 ట్రిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పరిమాణం 40 బిలియన్‌ డాలర్ల నుంచి 473 బిలియన్‌ డాలర్లకు.. వేర్‌ హౌసింగ్‌ మార్కెట్‌ సైజు 2.9 బిలియన్‌ డాలర్ల నుంచి 34 బిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేసింది.

Advertisement
 
Advertisement