మన్మథుడు.. వ్యాపార జగత్తులోనూ ‘కింగ్‌’ | Nagarjuna Akkineni Net Worth 2026 Untold Truth Behind His 3000 Cr Empire | Sakshi
Sakshi News home page

మన్మథుడు.. వ్యాపార జగత్తులోనూ ‘కింగ్‌’

Aug 29 2026 12:28 PM | Updated on Aug 29 2026 12:32 PM

Nagarjuna Akkineni Net Worth 2026 Untold Truth Behind His 3000 Cr Empire

తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసి ‘మన్మథుడు’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అక్కినేని నాగార్జున కేవలం రంగుల ప్రపంచానికే పరిమితం కాలేదు. వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఏకంగా సుమారు రూ.3,000 కోట్లకు పైగా సంపదతో భారతదేశంలోనే ధనిక కథానాయకుల్లో ఒకరిగా నిలిచినట్లు కొన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి. నాగార్జున హీరోగా, రా కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్‌100’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు ‘బాస్‌’ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ గ్లింప్స్‌ను మూవీ టీం విడుదల చేసింది.

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పోర్ట్స్ క్లబ్ వరకు..

నటనతో పాటు పక్కా వ్యాపార వ్యూహాలతో అడుగులు వేశారు. ప్రతిష్టాత్మక ‘అన్నపూర్ణ స్టూడియోస్’, ఎన్ కన్వెన్షన్ వంటి వ్యాపారాలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్‌)లో ‘కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ’ ఫుట్‌బాల్ టీమ్ భాగస్వామ్యం ఆయనకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. గతంలో ‘మాచ్ 1 రేసింగ్’ మోటార్ స్పోర్ట్స్ టీమ్‌లోనూ పెట్టుబడులు పెట్టారు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన బ్రాండ్ విలువ రోజురోజుకీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది.

అబ్బురపరిచే ఆస్తులు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వర్గాల్లో ఆకాశమే హద్దు అన్న రీతిలో నిర్మించిన సుమారు రూ.45 కోట్ల విలాసవంతమైన బంగ్లా నాగార్జున రాజసానికి నిదర్శనం. ఆయన వద్ద ఉన్న రేంజ్ రోవర్ వోగ్, పోర్షే కయాన్, బీఎమ్‌డబ్ల్యూ ఎం6, ఆడి ఏ7, టొయోటా వెల్‌ఫైర్ వంటి కార్ల కలక్షన్‌తో వాహన ప్రియులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో ‘మా టీవీ’ నెట్‌వర్క్‌లో కీలక వాటాదారుగా ఉండి ఆ తర్వాత స్టార్ నెట్‌వర్క్‌కు విక్రయించడం ద్వారా గణనీయమైన లాభాలను గడించారు. ఇవి కాకుండా వివిధ బ్రాండులను ఎండార్స్‌ చేసినప్పుడు వచ్చే ఆదాయం అదనం.

ఇదీ చదవండి: బంగారం కొంటున్నారా..? బిగ్ అలర్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement