breaking news
Empire
-
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్‌లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్‌తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాల జాబితా..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్‌ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.అనధికార నగదు లావాదేవీలు2019లో ఎన్‌ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.పడిపోయిన ఆస్తుల విలువబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు -
ఈసీ పక్షపాత అంపైరింగ్: రాహుల్
ఆనంద్: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పక్షపాత ఎంపైర్‌గా పనిచేస్తోందని క్రికెట్ పరిభాషలో మండిపడ్డారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అప్పట్లో తప్పుడు ఓటర్ల జాబితాను ఈసీ రూపొందించిందని ఆక్షేపించారు. క్రికెట్లో మనం తప్పులు చేయకపోయినా పదేపదే ఔట్ అవుతున్నామంటే అందుకు అంపైర్ పక్షపాత వైఖరే కారణమవుతుందని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని ఆనంద్ పట్టణంలో ‘సంఘటన్ సుజన్ అభియాన్’లో రాహుల్ పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ఒక దేవాలయంగా అభివర్ణించారు. అక్కడికి ఎవరైనా వచ్చి ప్రార్థనలు, పూజలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ, ప్రసాదం ఎవరికి దక్కాలన్నది బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తున్నాయని ఆక్షేపించారు. గుజరాత్లో అధికార బీజేపీని కచి్చతంగా ఓడించాలని, అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. గుజరాత్లో ఆ పార్టీని మట్టికరిపిస్తే కాంగ్రెస్‌కు ఇక తిరుగుండదని తేల్చిచెప్పారు. బీజేపీని గుజరాత్లో ఓడిస్తే ఎక్కడైనా ఓడించడం సులభమేనని సూచించారు. ‘మిషన్ 2027’రోడ్‌మ్యాప్‌పై ఈ కార్యక్రమంలో చర్చించారు. -
సీజర్ అంటే ఏమనుకున్నావ్..?
‘‘పురుషులందు పుణ్యపురుషులు..’’ అంటారు పెద్దలు. ఈ మాటకు వేర్వేరు అర్థాలు వాడుకలో ఉన్నా..ఎప్పటికప్పుడు మహానుభావులు మనకు ఎదురవుతూనే ఉంటారు. వీరు ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రవర్తిస్తారో వారికే ఓ పట్టాన బోధపడదు. ‘కిక్’ సినిమాలో కథానాయకుడిలా ఏదో ఒక వింత పని చేయందే వీరికి కిక్కుండదు. క్రీస్తు పూర్వం చివరిదశ కాలానికి చెందిన రోమన్ జనరల్ జూలియస్ సీజర్ కూడా అలాంటివాడే..! ప్రాచీన రోమన్ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, సైన్యాధిపతి అయిన ‘జూలియస్ సీజర్’ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా చెప్పుకొంటారు చరిత్రకారులు. ఇతడు రాజనీతి వ్యవహారాల్లోనే గాక లాటిన్ భాషలో గద్య కవిత్వం రాయడంలోనూ దిట్ట. ఈయన గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే..! క్రీ.పూ.75వ సంవత్సరంలో ప్రస్తుత గ్రీసు, టర్కీల మధ్యనున్న ఏజియన్ సముద్రం గుండా ప్రయాణిస్తున్నాడు పాతికేళ్ల సీజర్. సహాయకులు సేవలందిస్తుండగా.. ప్రకృతి అందాలను ఓడపై నుంచి చూస్తూ హాయిగా సముద్రయానం చేసేస్తున్నాడు. అలా ఓడ ఓ దీవి సమీపానికి చేరుకోగానే ఊహించని ప్రమాదం ఎదురైంది సీజర్ బృందానికి. కండలు తిరిగిన సముద్రపు దొంగలు (పైరేట్స్) ఓడను చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో సీజర్కు అర్థమయ్యేలోపే మారణాయుధాల సాయంతో అతడి బృందాన్ని బంధించి, తమ నౌకల్లోకి ఎక్కించుకున్నారు. తమను ఎందుకు బంధించారో తెలియని సీజర్.. విడుదల చేయాల్సిందిగా సముద్రపు దొంగలను కోరాడు. దానికి వారు ఒప్పుకోలేదు. ‘‘అడగ్గానే విడిచిపెట్టేయడానికి వెర్రివాళ్లలా కనిపిస్తున్నామా..? 20 టాలెంట్ల వెండి ఇస్తేనే నిన్ను విడిచిపెడతాం’’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఈ మొత్తాన్నీ ఇప్పటి లెక్కల్లో చెప్పుకోవాలంటే 620 కేజీలకు పైమాటే! వేరే ఎవరైనా అయితే తమ సహాయకులను పంపించి పైరేట్లు కోరిన మొత్తాన్నీ తెప్పించేవారు. కానీ, జూలియస్ సీజర్ అలా చేయలేదు. పైరేట్లను ఎగాదిగా చూస్తూ వికటాట్టహాసం చేశాడు. ‘‘ఏయ్..! సీజర్ అంటే ఏమనుకున్నారు..? ముష్టి 20 టాలెంట్ల వెండి అడుగుతారా..? నా విలువ ఎంతో తెలుసా..! కనీసం 50 టాలెంట్లు అడిగితే కానీ నా సహాయకులను పంపను’’ అంటూ పట్టుదలకు పోయాడు. సీజర్ మాటలకు సముద్రపు దొంగలు తొలుత బుర్రలు గోక్కున్నారు. అయినప్పటికీ, చేసేదేం లేక అతడు చెప్పినట్టే కానిచ్చారు. అలా, వెళ్లిన సీజర్ పరిచారకులు వెండితో తిరిగి వచ్చేసరికి 38 రోజులు పట్టింది. అయితే, ఇన్ని రోజులూ ఈ రోమ్ వీరుడు పైరేట్ల చేతిలో బందీగా ఉండాల్సింది పోయి, వారిపైనే పెత్తనం చెలాయించాడట! పైరేట్లకు కవిత్వం చెబుతూ, లాటిన్ భాషలో వ్యాసాలు రాస్తూ కాలం గడిపేశాడట. అక్కడితో ఆగక.. సముద్రపు దొంగలతో తన వ్యక్తిగత పనులనూ ఈయన చేయించుకునేవాడని చెబుతాడు చరిత్రకారుడు ప్లుటార్చ్. అలా కొద్ది రోజులు గడిచాక పైరేట్లు సీజర్ పెత్తనాన్ని తట్టుకోలేకపోయారట. అతడితో వేగలేక, సొమ్ము వచ్చినా రాకున్నా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని అతడితో చెప్పారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో బందీలు ఎగిరి గంతేస్తారు. కానీ, ఈ రోమన్ జనరల్ మాత్రం చిత్రంగా ప్రవర్తించాడు. పైరేట్ల మాటలను పట్టించుకోకుండా.. ‘‘మీకు నగదు ముట్టచెప్పందే నేను ఇక్కడి నుంచి వెళ్లను..’’ అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. తీరా నగదు వచ్చాక వారికి అందిస్తూ.. ‘‘మీ అంతు చూస్తాను. మిమ్మల్నందరినీ శిలువలకు వేలాడదీస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు. చెప్పినట్టుగానే కొద్ది వారాల వ్యవధిలోనే ఒక చిన్న ఓడల సమూహాన్ని వెంటబెట్టకుని అక్కడకు చేరుకున్నాడు సీజర్. అయితే, అతడి హెచ్చరికను పెద్దగా పట్టించుకోని పైరేట్లు అక్కడే కాలక్షేపం చేస్తూ కనిపించారు. అంతే.. వారందరినీ బందీలుగా పట్టుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లాడు. పనిలో పనిగా తన 50 టాలెంట్ల వెండితో పాటు దొంగల సొత్తును సైతం వెనక్కి తీసుకొచ్చాడు. ఇన్ని చేసిన వాడు శూల దండన విధించకుండా ఉంటాడా..! ఇదంతా చూసిన అప్పటి ప్రజలు జూలియస్ సీజర్ వింత ప్రవర్తనకు నోరెళ్లబెట్టారట! భలే విచిత్రమైన వ్యక్తి కదూ..!


