డిజిటల్‌ రుణాల బాటలో బ్యాంకులు

MSME loans to shift to digital lending in 2-3 years - Sakshi

3 ఏళ్లలో రిటైల్‌ రుణాల్లో సగం

ఇదే విధానంలో మంజూరు

ముంబై: డిజిటల్‌ రుణాల విధానం బ్యాంకింగ్‌ ముఖచిత్రాన్ని భారీ స్థాయిలో మార్చేస్తోందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌ రాయ్‌ జి తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో రిటైల్, చిన్న సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో దాదాపు సగభాగం వాటా డిజిటల్‌ రుణాల ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌ సంస్థల వార్షిక సదస్సు సిబాస్‌ 2021లో పాల్గొన్న సందర్భంగా రాయ్‌ ఈ విషయాలు చెప్పారు. డిజిటల్‌ రుణాల విభాగం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆన్‌లైన్‌లోనే సరీ్వసులు అందించగలిగేలా తగు సాధనాలను బ్యాంకులు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

రాబోయే రోజుల్లో ఎంఎస్‌ఎంఈ రుణాల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోగలవన్నారు. మరోవైపు ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) వచి్చన తొలినాళ్లలో అది బ్యాంకింగ్‌కు పోటీగా మారుతుందనే అభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాయ్‌ చెప్పారు. ‘ఫిన్‌టెక్‌లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయపడుతున్నాయి. అవి మాకు పోటీ కాదు‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు నిరంతరం టెక్నాలజీలో ఇన్వెస్ట్‌ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ అవుతూ ఉండాలని రాయ్‌ సూచించారు. టెక్నాలజీలో నిపుణులు, కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను నియమించుకోవడం పై ప్రభుత్వ రంగ బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top