Most Affordable Electric Cars In India: భారత్‌లో తక్కువ ధరకే లభిస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్స్‌ ఇవే..!

Most Affordable Electric Cars In India In Telugu - Sakshi

భారత ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు  సందడి చేస్తున్నాయి.  ఇంధన ధరలు వీపరితంగా పెరిగిపోవడంతో సాంప్రదాయ వాహనాలకు బదులుగా ఈవీ వాహనాలవైపు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. వాహన కొనుగోలుదారులతో పాటుగా ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకంపై పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీ ఆదరణను నోచుకుంటున్నాయి.  

ఇక భారత్‌లో ఇప్పటివరకు సుమారు 10 కార్లకు పైగా ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో హ్యుందాయ్‌, టాటా, ఎంజీ మోటార్స్‌, మహీంద్రా లాంటి ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి. కాగా వీటిలో భారత్‌లో అత్యంత సరసమైన ధరలకే వస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్ల గురించి తెలుసుకుందాం...

భారత్‌లో అత్యంత తక్కువ ధరకే వస్తోన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

1. టాటా-టిగోర్‌
ప్రముఖ భారత ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ రెండు ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్‌ చేసింది. వాటిలో టాటా టిగోర్ జిప్ట్రాన్ కాంపాక్ట్ సెడాన్  అత్యంత తక్కువ ధరకే రానుంది. ఈ కారులో 26 kWh బ్యాటరీను  కంపెనీ ఏర్పాటుచేసింది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే సుమారు 306 కి.మీ. మేర ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది. ల వరకు ప్రయాణిస్తుంది. 15 ఆంపియర్ వాల్ అడాప్టర్‌ సహాయంతో  ఈ కారును 80 శాతానికి ఛార్జ్ చేయడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది. అయితే డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే 80 శాతం బ్యాటరీని కేవలం ఒక గంటలోపే ఛార్జ్‌ చేయవచ్చును. ఈ కారు 74 bhp సామర్థ్యంతో 170 ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది.  దీని ధర రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకానుంది.

2. టాటా-నెక్సాన్‌
టాటా మోటార్స్‌ నుంచి వచ్చిన రెండో ఎలక్ట్రిక్‌ వాహనం టాటా నెక్సాన్ ఈవీ. ఇది భారతీయ ఈవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్. దీనిలో 30.2 kWh బ్యాటరీను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీని కేవలం ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు 127 bhp సామర్థ్యంతో 245ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది.  దీని ధర రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకానుంది. 

3. ఎంజీ మోటార్స్‌- ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ
ప్రముఖ బ్రిటన్‌ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ భారత్‌లోని ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ కారును ప్రవేశపెట్టింది. 2021 కొద్ది మార్పులతో ఈ కారున ఎంజీ మోటార్స్‌ అప్‌డేట్‌ చేసింది. ఈ కారు 44kWh బ్యాటరీతో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 419 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోందనీ కంపెనీ పేర్కొంది. 15 amp ఛార్జర్‌తో సుమారు 17 నుంచి 18 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. అయితే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తో ఈ కారును  50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీను ఛార్జ్‌ చేయవచ్చును. ఈ కారు 142  bhp సామర్థ్యంతో 353 ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది. దీని ధర రూ. 20.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలుకానుంది. 

4. హ్యుందాయ్‌-కోనా
దక్షిణ కొరియన్‌ దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్స్‌ భారత్‌లోకి కోనా పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాన్ని రిలీజ్‌ చేసింది. భారత ఈవీ మార్కెట్లలో లాంచైనా తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీగా హ్యుందాయ్‌ కోనా నిలిచింది. 39.2 kWh బ్యాటరీతో రానుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 452 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోందని కంపెనీ పేర్కొంది. కేవలం ఒక గంటలోపు 80 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేయవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఈ కారు 134  bhp సామర్థ్యంతో 395 ఎన్‌ఎమ్‌ టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తోంది దీని రూ. 23.79 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుంది.

చదవండి: హ్యుందాయ్‌ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!
చదవండి:  పేరుకు సెకండ్‌ హ్యాండ్‌ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్‌ ఇవే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top