
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ మివి కొత్తగా కృత్రిమ మేథ ఆధారిత ఏఐ బడ్స్‌ను ప్రవేశపెట్టింది. సెటింగ్స్ ఏవీ మార్చకుండానే తెలుగు, హిందీ సహా ఎనిమిది భారతీయ భాషలను ఇది అర్థం చేసుకుని, ప్రతిస్పందిస్తుంది. యూజర్ల ప్రాధాన్యతలను గుర్తుపెట్టుకుని, సందర్భానుసారంగా వ్యవహరించేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ కో–ఫౌండర్ మిధులా దేవభక్తుని తెలిపారు. 40 గంటల బ్యాటరీ లైఫ్, 3డీ సౌండ్‌స్టేజ్, స్పష్టత కోసం క్వాడ్ మైక్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ. 6,999గా ఉంటుంది.
ఏఐ బడ్స్ లో మివి ఏఐ అనే ప్రొప్రైటరీ వాయిస్ అసిస్టెంట్ ఉంది. "హాయ్ మివి" అంటే చాలు ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రతిస్పందిస్తుంది. ఇది ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. అవి హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ. లాంగ్వేజ్ సెట్టింగ్ ల మార్చుకునే పనిలేకుండానే వినియోగదారులు ఏ భాషలోనైనా ప్రశ్నలు అడగవచ్చు లేదా సహాయాన్ని అభ్యర్థించవచ్చు.

అసిస్టెంట్ అవతార్ ల ద్వారా మివి ఏఐ బడ్స్ వివిధ పనులకు సహకారం అందిస్తుంది. ఇవి ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్.
🔸జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు గురు అవతార్ సమాధానాలు చెబుతుంది.
🔸ఇంటర్వ్యూవర్ అవతార్ మాక్ ఇంటర్వ్యూలు, ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.
🔸చెఫ్ అవతార్ వంట చేయడంలో మార్గనిర్దేశం చేస్తుంది.
🔸వెల్ నెస్ కోచ్ అవతార్ సంభాషణల సమయంలో యూజర్ ఇన్ పుట్ లకు స్పందిస్తుంది.
🔸న్యూస్ రిపోర్టర్ అవతార్ యూజర్ ఆసక్తుల ఆధారంగా న్యూస్ అప్ డేట్స్ అందిస్తుంది.
🔸గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న మివి ఏఐ యాప్ ద్వారా యూజర్లు ఏఐ సెట్టింగ్స్, ఫీచర్లను మేనేజ్ చేసుకోవచ్చు.