Microsoft: యాపిల్‌ నెంబర్‌ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్‌..!

Microsoft Nearly Overtakes Apple As Most Valuable Company - Sakshi

మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడిపోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.  

రిఫినిటివ్‌ డేటా ప్రకారం...మైక్రోసాఫ్ట్‌ షేర్లు 4.2శాతం పెరిగి రికార్డు స్థాయిలో 323.17 డాలర్ల వద్దకు చేరాయి. మైక్రోసాఫ్ట్‌ అజూర్ క్లౌడ్-కంప్యూటింగ్ వ్యాపారం బలమైన త్రైమాసిక వృద్ధికి ఆజ్యం పోసింది. దీందో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 2.426 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. మైక్రోసాఫ్ట్ షేర్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది షేర్లు సుమారు 45 శాతం మేర లాభాలను గడించాయి. కరోనా మహామ్మారి ఒక్కింతా మైక్రోసాఫ్ట్‌కు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. మైక్రోసాఫ్ట్‌కు క్లౌడ్‌ ఆధారిత సేవలు భారీగా డిమాండ్‌ ఏర్పడడంతో భారీ లాభాలను సొంతం చేసుకుంది. 
చదవండి: టైటాన్‌ డబుల్‌ ధమాకా..!

సప్లై చైన్‌ గండం..!
రెండో త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించిన మైక్రోసాఫ్ట్‌ను సప్లై చైన్‌ విభాగం కలవరపెడుతోంది. మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు, ఎక్స్‌బాక్స్‌ గేమింగ్ కన్సోల్‌లను ఉత్పత్తి చేసే యూనిట్‌లకు సరఫరా-గొలుసు సమస్యలు కొనసాగే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. 

యాపిల్‌ అంతంతే..!
యాపిల్‌ తన త్రైమాసిక ఫలితాలను మంగళవారం రోజున ప్రకటించింది. యాపిల్‌ ఆశించిన మేర ఫలితాలు రాలేదు. త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన వెంటనే యాపిల్‌ షేర్లు గురువారం రోజున సుమారు 0.3 శాతం మేర క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్‌ సంక్షోభం ఐఫోన్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాపిల్‌ను చిప్స్‌ కొరత కూడా వెంటాడుతుంది.  2021లో యాపిల్‌ షేర్లు సుమారు 12 శాతం మేర పెరిగాయి. యాపిల్‌ స్టాక్‌ మార్కెట్‌ విలువ 2010లో మైక్రోసాఫ్ట్‌ను అధిగమించింది. రెఫినిటివ్‌ ప్రకారం... సగటున యాపిల్‌ క్యూ2లో 31 శాతం పెరిగి 84.8 బిలియన్‌ డాలర్లకు చేరింది.  ఈ రెండు కంపెనీలు ఇటీవలి సంవత్సరాలలో వాల్ స్ట్రీట్ అత్యంత విలువైన కంపెనీగా మారాయి. 
చదవండి: 2008లో టెస్లా కార్లపై ఎలన్‌ వ్యాఖ్యలు, ఇప్పుడు వైరల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top