స్మార్ట్‌ఫోన్‌తో ఆక్సిజన్‌ లెవల్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి

MFine launches SPO2 tracking tool to turn smartphones into oximeters - Sakshi

స్మార్ట్‌ఫోనే ఆక్సీమీటర్‌...కొత్త టూల్

ఆక్సీమీటర్‌ మాదిరిగా ఎంఫైన్‌ పల్స్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ హెల్త్‌ స్టార్టప్‌ ఎంఫైన్‌.. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని తెలుసుకోవడానికి యాప్‌లో ఎంఫైన్‌ పల్స్‌ పేరుతో టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాక్ కెమెరా, ఫ్లాష్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్‌తోనైనా ఉపయోగించవచ్చని ఎంఫైన్‌ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజిత్ నారాయణ్ వెల్లడించారు.

శ్వాసకోశ లేదా తీవ్రమైన గుండెజబ్బులున్నవారు స్లీప్ అప్నియా, భారీ గురక, నవజాత శిశువుల్లో ఆక్సిజన్ సంతృప్త స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిఫార్సు చేస్తారు. అలాగే ప్రస్తుతం  సమయంలో  కరోనా వైరస్‌ రోగుల్లో కూడా ఆక్సిజన్‌ స్థాయిలను మానిటరింగ్‌లో ఈ ఆ క్సీమీటర్‌ పాత్ర చాలాకీలకం.

ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, ఫ్లాష్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఆన్‌డ్రాయిడ్‌ యూజర్లకు ఇది పరిమితం. త్వరలో ఐఓఎస్‌ వినియోగదారుల కోసం ప్రారంభించబడుతుంది.  ఫైన్‌ పల్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ కాస్తా ఆక్సీమీటర్‌గా మారిపోతుంది.

ఇలా చెక్‌ చేసుకోండి:
► గూగుల్‌ ప్లేస్టోర్‌లో mfine యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.
► మెజర్‌ యువర్‌ బ్లడ్‌ ఆక్సీజన్‌ లెవల్స్‌పైన క్లిక్‌ చేయండి.
► మెజర్‌ బటన్‌పైన క్లిక్‌ చేయండి. 
► తర్వాత మీ చేతి వేలిని బ్యాక్‌ కెమెరాపై 20 సెకన్ల పాటు ఉంచండి
► అంతే  రెండు సెకన్లలో మీ ఆక్సిజన్‌ లెవల్స్ డిస్‌ప్లే అవుతాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top