మెసేజ్‌ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం | Meta AI Introduces Private Message Summaries on WhatsApp | Sakshi
Sakshi News home page

మెసేజ్‌ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం

Jun 26 2025 4:31 PM | Updated on Jun 26 2025 4:53 PM

Meta AI Introduces Private Message Summaries on WhatsApp

మెటా వాట్సప్‌లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వాట్సప్‌లో చదవని మెసేజ్‌ల సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకునేందుకు మెటా ఏఐ సాయం చేయనుందని పేర్కొంది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు నిత్యం పెద్ద టెక్స్ట్‌ మేసేజ్‌లను స్క్రోల్‌ చేసి పూర్తిగా చదవకుండా మెటా ఏఐ అందులోని సంక్షిప్త సారాంశాన్ని అందిస్తుంది. ఇంగ్లిష్ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వాట్సప్‌ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు మెటా తెలిపింది. ఈ ఏడాది చివర్లో క్రమంగా మరిన్ని ప్రాంతాలతోపాటు ఇతర భాషలకు ఈ ఫీచర్‌ను విస్తరిస్తామని స్పష్టం చేసింది.

మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం మెసేజ్‌లు వచ్చే గ్రూప్‌లు, వ్యక్తులకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ మెసేజ​్‌లు చదివే క్రమంలో యూజర్ల కంటెంట్‌పట్ల భద్రత పాటిస్తామని వాట్సప్‌ హామీ ఇచ్చింది. ఏఐ ఫీచర్‌ డేటాను బాహ్య సర్వర్లకు ప్రసారం చేయకుండా లేదా కంపెనీ సిస్టమ్‌లకు బహిర్గతం చేయకుండా ప్రాసెస్ చేస్తుందని తెలిపింది.

ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్‌ నెనేటర్‌

యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడానికి వాట్సప్‌ డిఫాల్ట్‌గా ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయదని చెప్పింది. మాన్యువల్‌గానే దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలని పేర్కొంది. ఇది ఆప్షనల్ ఫీచర్‌గా మాత్రమే ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ చాట్ ప్రైవసీ కంట్రోల్స్‌లో యూజర్లు తమ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement