ఎలాన్‌ మస్క్‌కు ఝలక్‌: లెవల్‌-3 అటానమస్‌ కార్ల తొలి కంపెనీ ఏదంటే?

Mercedes beats Tesla in selfdriving cars becomes first in US - Sakshi

న్యూఢిల్లీ:  టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌కు షాక్‌ తగిలింది.సెల్ఫ్‌-డ్రైవింగ్‌  కార్లలో టెస్లాను బీట్‌ చేసింది మరో టాప్‌ కార్‌మేకర్‌ మెర్సిడెస్. అమెరికాలో  లెవెల్-3 అటానమస్ సర్టిఫైడ్ కార్లను   అందించిన  తొలి కంపెనీగా అవతరించింది. తద్వారా ఇటీవలి  కీలకమైన రేసులో మెర్సిడెస్‌ టెస్లాపై పైచేయి సాధించింది. 

లెవెల్-3 ఆటోమేషన్‌, కండిషనల్‌ ఆటోమేషన్‌గా పిలిచే ఈ రేసులో మెర్సిడెస్‌ దూసుకొచ్చింది. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (SAE) ద్వారా డ్రైవింగ్ ఆటోమేషన్ లెవల్‌-3గా వర్గీకరించింది. ఇది నిర్దిష్ట పరిస్థితులలో కారును స్వయంగా నడపడానికి అనుమతిస్తుంది. స్టీరింగ్‌ పట్టుకోవాల్సిన, బ్రేక్‌ను కంట్రోల్‌ చేయాల్సిన అవసరం లేకుండానే కారు నడిపవచ్చు. అయితే  డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ,  ఏ క్షణంలోనైనా కంట్రోల్‌లోకి తీసుకునేలా అలర్ట్‌గా ఉండాలి.  

లెవల్‌-3 ఆటోమేషన్‌ కోసం ప్రంపచవ్యాప్తంగా దిగ్గజ ఆటో కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఈ విషయంలో టెస్లా, దాని ఫుల్లీ సెల్ఫ్‌-డ్రైవింగ్ ఫీచర్ ముందంజలో ఉన్నప్పటికీ కానీ సమయానికి అవసరమైన ధృవపత్రాలను పొందలేకపోయినట్టు  తెలుస్తోంది.  అయితే నిబంధనల  పరంగా  లెవెల్-3 ఆటానమస్‌  అంతా ఆశాజనంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. చాలా దేశాల్లో  ఇంకా లెవల్-3 ఆటోమేషన్‌  వాహనాలకు నిర్దిష్ట నిబంధనలను కలిగి లేవు . అలాగే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్, కారు తయారీదారుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మాత్రమే  అనుమతి. 

"ఇన్నోవేషన్‌ పట్ల తిరుగులేని నిబద్ధతే మెర్సిడెస్-బెంజ్‌ను మొదటి నుండి నిలకడగా మార్గ నిర్దేశనం చేసిందనీ, దీన్ని కొనసాగించడతోపాటు, లెవల్-3 షరతులతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ సర్టిఫికేట్ పొందిన తొలి ఆటోమోటివ్ కంపెనీ నిలవడం గర్వకారణమని  మెర్సిడెస్‌ అమెరికా  మార్కెటింగ్ అండ్‌  సేల్స్  హెడ్‌, సీఈవో హెడ్ డిమిట్రిస్ పిసిలాకిస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

లెవెల్-3 స్వయంప్రతిపత్తి సాంకేతికత అభివృద్ధి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవింగ్‌కు ప్రయాణంలో ఒక అడుగు మాత్రమే, ఇంకా చాలా పురోగతి సాధించాల్సి ఉందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే, మెర్సిడెస్ సాధించిన  లెవెల్-3 ఆటోమేషన్‌ విజయం ఆటో పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, లెవల్-3 నుంచి లెవల్‌-4,లెవల్‌-5 ఆటోమేషన్‌  ఉన్నత స్థాయి అటానమస్‌ డ్రైవింగ్‌ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్లను రోడ్లపై దూసుకుపోయేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top