మారుతి సుజుకి బంపర్ అఫర్

Maruti Suzuki Offering Discounts on Select Models in March 2021 - Sakshi

కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వారి కోసం మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొన్ని మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఆఫర్ లభించనున్నట్లు పేర్కొంది. ఎర్టిగా మినహా మిగతా అన్ని ఎంట్రీ లెవల్​ కార్లపై ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ కార్ల డిమాండ్​ను, అమ్మకాలను పెంచుకోవడం కోసం ఈ ఆఫర్​ను ప్రకటించినట్లు పేర్కొంది. అయితే, ఈ ఆఫర్లన్నీ దేశమంతటా ఒకే విధంగా ఉండవని నగరాల డీలర్‌షిప్‌ల బట్టి మారుతాయని స్పష్టం చేసింది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

మోడళ్ల వారీగా డిస్కౌంట్:

  • మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మోడల్ పై రూ.52 వేల వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి సెలెరియో మోడల్ పై  రూ.47,000 వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి ఆల్టో మోడల్ పై రూ.42,000 వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి ఎకో మోడల్ పై రూ.37,000 వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి స్విఫ్ట్​ మోడల్ పై  రూ.30,000 వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మోడల్ పై రూ.35,000 వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి డిజైర్ మోడల్ పై రూ.35,000 వరకు తగ్గింపు
  • మారుతి సుజుకి వాగన్ ఆర్ మోడల్ పై రూ.30,000 వరకు తగ్గింపు

చదవండి:

కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్

దేశంలో ఫ‌స్ట్ ఏసీ రైల్వే ట‌ర్మిన‌ల్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top