కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్

Hyundai Discount Offer in March 2021 - Sakshi

మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా తన మోడళ్లపై అదిరిపోయే      డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో కారు కొనే వారికి చాలా ఊరట లభించనుంది. హ్యుందాయ్ తన కార్ల అమ్మకాలలో గత నెలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గత నెలలో 51, 600 యూనిట్లను విక్రయించింది. ఇది 2020 ఫిబ్రవరిలో 40,010 యూనిట్ల పోల్చితే 29 శాతం ఎక్కువ. 

హ్యుందాయ్ కార్లలో క్రెటా, ఐ20 కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. గణనీయమైన వృద్ధిని నమోదు చేయడానికి ప్రధాన కారణం తన కార్ల మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందించడమే. అందుకే ఈ నెలలో కూడా కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్, ఎలంట్రా, శాంట్రో, ఆరా, కోనా వంటి మోడళ్లకు ఈ ఆఫర్ వర్తించనుండగా.. మార్చి నెలాఖరు దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందించింది క్రింద తెలుసుకోండి.

మోడళ్ల వారీగా డిస్కౌంట్:

  • హ్యుందాయ్ కోనా మోడల్ పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు
  • హ్యుందాయ్ ఎలంట్రా మోడల్ పై రూ.1 లక్ష వరకు తగ్గింపు
  • హ్యుందాయ్ ఆరా మోడల్ పై రూ.70 వేలు వరకు తగ్గింపు
  • హ్యుందాయ్ నియోస్ మోడల్ పై రూ.60 వేలు వరకు తగ్గింపు
  • హ్యుందాయ్ శాంట్రో(ఎంట్రీ లెవెల్) మోడల్ పై రూ.50 వేలు వరకు తగ్గింపు
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top