నష్టాలతో మొదలై రికవరీ- చిన్న షేర్లు గుడ్ | Market turns into profits despite weak opening | Sakshi
Sakshi News home page

నష్టాలతో మొదలై లాభాల్లోకి

Sep 11 2020 9:40 AM | Updated on Sep 11 2020 9:44 AM

Market turns into profits despite weak opening - Sakshi

టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో గురువారం యూఎస్‌ మార్కెట్లు మళ్లీ పతనంకావడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే రికవరీ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 92 పాయింట్లు పుంజుకుని 38,932కు చేరగా.. నిఫ్టీ 27పాయింట్లు బలపడి 11,476  వద్ద ట్రేడవుతోంది. గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేసిన విషయం విదితమే. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి విదేశాంగ మంత్రుల మధ్య సయోధ్య కుదిరిన వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. తొలుత సెన్సెక్స్‌ 38,738 వద్ద, నిఫ్టీ 11,424 దిగువన కనిష్టాలను తాకడం గమనార్హం!

మీడియా మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో మీడియా 0.4 శాతం బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటీ 1-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌ 4 శాతం జంప్‌చేయగా, టైటన్‌, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, మారుతీ, గెయిల్‌, ఐటీసీ 2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐషర్‌, నెస్లే, శ్రీ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌, జీ, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌,పవర్‌గ్రిడ్‌ 1-0.5 శాతం మధ్య నీరసించాయి.

సీఫోర్జ్‌ భేష్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో సీఫోర్జ్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, కెనరా బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌, కంకార్‌, పిరమల్‌, భెల్‌, రామ్‌కో సిమెంట్‌, ఎస్కార్ట్స్‌ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. కమిన్స్‌, పీవీఆర్‌, వేదాంతా, టాటా పవర్‌, బాష్‌, ఐడియా 1.8-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 968 లాభపడగా., 460 నష్టాలతో కదులుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement