ఏప్రిల్‌లో స్తంభించిన తయారీ

Manufacturing PMI Remains Steady In April Amid Second Covid-19 Wave - Sakshi

8 నెలల కనిష్టం.. 55.5 వద్ద పీఎంఐ

న్యూఢిల్లీ: తయారీ పరిశ్రమ ఉత్పత్తి ఏప్రిల్‌లో దాదాపు మార్చి స్థాయిలోనే నిలిచింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఏప్రిల్‌లో 55.5 వద్ద ఉంది. మార్చిలో ఇండెక్స్‌ 55.4 వద్ద (ఎనిమిది నెలల కనిష్ట స్థాయి) ఉంది. దాదాపు యథాతథ స్థితికి కరోనా వైరెస్‌ సెకండ్‌వేవ్‌ సృష్టించిన అనిశ్చితి వాతావరణమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. సూచీ 50లోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఆపై వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. తాజా సమీక్షా నెల్లో కొత్త ఆర్డర్లలో వృద్ధి నమోదుకాలేదు.  

ముడి పదార్థాల ధరల స్పీడ్‌...
2014 జూలై తరువాత ఎన్నడూ లేనంత వేగంగా ముడి పదార్థాల ధరలు పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పొలియన్నా డి లిమా పేర్కొన్నారు. కాగా ఏప్రిల్‌లో వరుసగా ఎనిమిదవ నెల ఎగుమతుల ఆర్డర్లు పెరిగినట్లు డి లిమా వెల్లడించారు. భారతీయ వస్తువులకు అంతర్జాతీయ డిమాండ్‌ దీనికి ప్రధాన కారణమని తెలిపారు. ఇక తయారీ రంగంలో వరుసగా 13వ నెలా ఉపాధి అవకాశాలు తగ్గాయని వెల్లడించారు.  తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదవ నెల.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top