నిరుద్యోగులకు తీపి కబురు.. | ManpowerGroup Employment Outlook Survey for Q2 2025 reveals a stable global hiring | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు తీపి కబురు..

Mar 13 2025 9:05 AM | Updated on Mar 13 2025 9:05 AM

ManpowerGroup Employment Outlook Survey for Q2 2025 reveals a stable global hiring

క్యూ2లో కొలువుల జోరు..

ఏప్రిల్‌–జూన్‌ కాలానికి సానుకూలత

55 శాతం కంపెనీలు రెడీ..

మ్యాన్‌పవర్‌గ్రూప్‌ సర్వేలో వెల్లడి 

రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) నియామకాలు బలంగా ఉండనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, భారత కంపెనీలు ఈ ఏడాది క్యూ2లో అధిక నియామకాలను చేపట్టే ఉద్దేశంతో ఉన్నట్టు మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ‘ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే’లో తెలిసింది. నికర నియామక ఉద్దేశం (ఎన్‌ఈవో) 43 శాతానికి చేరింది. అంతర్జాతీయంగా చూస్తే వచ్చే త్రైమాసికానికి ఇది సగటున 18 శాతమే ఉంది. 42 దేశాలకు చెందిన 40,413 కంపెనీల అభిప్రాయాలను ఈ సర్వే కోసం మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ పరిగణనలోకి తీసుకుంది. జనవరి 2 నుంచి 31 వరకు సర్వే జరిగింది.

సర్వే ఫలితాలు..  

  • ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కొత్త నియామకాలు చేపడతామని 55 శాతం కంపెనీలు తెలిపాయి. జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే నియామకాలు తగ్గుతాయని 12 శాతం కంపెనీలు చెప్పగా, తమ సిబ్బందిలో ఎలాంటి మార్పులు ఉండవని 29 శాతం కంపెనీలు సంకేతమిచ్చాయి. మరో 4 శాతం కంపెనీలు ఏమీ చెప్పలేమని పేర్కొన్నాయి.

  • ఐటీ రంగంలో 55 శాతం, ఇండ్రస్టియల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రంగంలో 48 శాతం, హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో 42 శాతం, రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్‌లో 40 శాతం, కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌లో 38 శాతం చొప్పున నియామకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంతో పోల్చి చూస్తే పెరగనున్నట్టు సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది.

  • ఫైనాన్షియల్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 43 శాతం మేర నియామకాలు పెరగనున్నాయి. కానీ, జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఒక శాతం తక్కువ.  

  • ఎనర్జీ అండ్‌ యుటిలిటీస్‌లో 32 శాతం, కన్జ్యూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌లో 32 శాతం, చొప్పున నియామకాల ఉద్దేశ్యం కనిపించింది. క్యూ1 కంటే 6 పాయింట్లు, 8 పాయింట్ల మేర తగ్గడం గమనార్హం.  

  • దక్షిణాదిన 39 శాతం, ఉత్తరం, తూర్పు భారత్‌లో 47 శాతం, పశ్చిమాదిలో 47 శాతం మేర అధిక నియామకాలు వచ్చే క్వార్టర్‌లో చోటుచేసుకోనున్నాయి.  

  • సిబ్బందిని పెంచుకోవడానికి కార్యకలాపాల విస్తరణ ప్రధాన కారణంగా ఉంది.

ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్‌.. కాసేపటికే డిలీట్‌

వ్యాపార సంస్థల్లో విశ్వాసం..

నియామకాల ఉద్దేశ్యం జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌కు బలపడింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనటంలో భారత వ్యాపార సంస్థల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీ, ఇండ్రస్టియల్, ఫైనాన్షియల్‌ రంగంలో బలమైన నియామకాల ధోరణి కొనసాగుతుంది. 

– సందీప్‌ గులాటి, మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement