మేక్‌మైట్రిప్‌ భారీ నిధుల సమీకరణ  | MakeMyTrip to raise up to 3 billion dollers to buy back Trip.com | Sakshi
Sakshi News home page

మేక్‌మైట్రిప్‌ భారీ నిధుల సమీకరణ 

Jun 19 2025 6:10 AM | Updated on Jun 19 2025 7:58 AM

MakeMyTrip to raise up to 3 billion dollers to buy back Trip.com

ట్రిప్‌.కామ్‌ వాటా కొనుగోలుకి వెచ్చింపు 

న్యూఢిల్లీ: షేర్లు, మార్పిడికి వీలయ్యే బాండ్ల విక్రయం ద్వారా 2.5 బిలియన్‌ డాలర్ల(రూ. 21,500 కోట్లు)కుపైగా సమీకరించనున్నట్లు ట్రావెల్‌ బుకింగ్‌ సర్వీసుల దిగ్గజం మేక్‌మైట్రిప్‌ తాజాగా తెలియజేసింది. నిధులను చైనా సంస్థ ట్రిప్‌.కామ్‌ గ్రూప్‌ వాటా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ట్రిప్‌.కామ్‌ గతంలో కొనుగోలు చేసిన క్లాస్‌ బీ షేర్లను సొంతం చేసుకునేందుకు పెట్టుబడులను వినియోగించనున్నట్లు నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ పేర్కొంది.

 గత నెలలో పాకిస్తాన్‌పై చేపట్టిన మిలిటరీ చర్యల తదుపరి చైనా, టర్కీ తదితర దేశాల నుంచి బిజినెస్‌లను తగ్గించుకోవాలని దేశీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో మేక్‌మైట్రిప్‌ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మేక్‌మైట్రిప్‌లో చైనా సంస్థలకు యాజమాన్య హక్కులున్నట్లు ప్రత్యర్ధి కంపెనీ ఈజ్‌మైట్రిప్‌ వ్యవస్థాపకుడు నిశాంత్‌ పిట్టీ గత నెలలో ఆరోపించిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement