లగ్జరీ ఇళ్లకు భలే డిమాండ్‌ 

Luxury home sales zoom jumps 55percent in 2023 - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస గృహాల(లగ్జరీ ఇళ్లు)కు డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. రూ.50 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న లగ్జరీ ఇళ్లు విక్రయాలు గతేడాదిలో 51% పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది. అమ్ముడైన మొత్తం 45 లగ్జరీ ఇళ్ల విలువ రూ.4,319 కోట్లుగా ఉంది. వీటిలో 58% అపార్ట్‌మెంట్లు, 42% బంగ్లాలు. అంతకు ముందు ఏడాది(2022)లో అమ్ముడైన 29 విలాస గృహాల విలువ రూ.2,859 కోట్లుగా ఉంది.  

మొత్తం 45 యూనిట్లలో ముంబైలో విక్రయమైన 29 లగ్జరీ ఇళ్ల విలువ రూ.3,031 కోట్లు, ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో అమ్ముడైన 12 లగ్జరీ ఇళ్ల విలువ రూ.1,043 కోట్లు, బెంగుళూరు విక్రయమైన 4 లగ్జరీ ఇళ్ల విలువ రూ.245 కోట్లుగా ఉంది.  

‘‘అత్యంత సంపన్నల నుంచి అధిక గిరాకీ ఉండటంతో లగ్జరీ ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అమ్ముడైన 45 లగ్జరీ ఇళ్లలో రూ.100 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న ఇళ్ల సంఖ్య 14గా ఉంది. వీటిలో అత్యధిక అమ్మకాలు ముంబై జరిగాయి. విలాసవంతమైన ఆస్తులపై సంపన్నులకు విశ్వాసం క్రమంగా పెరుగుతుండంతో భవిష్యత్తులోనూ లగ్జరీ అమ్మ కాలు పెరగొచ్చు’’ అని జేఎల్‌ఎల్‌ ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ సమంతక్‌ దాస్‌ తెలిపారు.    

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top