LPG Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌..! రూ.300 వరకు రాయితీ ఇలా పొందండి..!

LPG Cylinder To Cost You Rs 300 Less - Sakshi

ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం తగ్గింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర  ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్లపై మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఎల్‌పీజీ సిలిండర్లపై భారీ రాయితీ..!
ఇంధన ధరలతో పాటుగా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగానే పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ ధర ఏకంగా రూ.1000కు చేరువైంది. దాంతో పాటుగా గ్యాస్‌ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల కొనుగోలుపై సుమారు రూ.20 నుంచి రూ. 40 వరకు మాత్రమే సబ్సిడీని పొందుతున్నారు. గ్యాస్‌ సిలిండర్లపై ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.312.48కి సబ్సీడి అందించాలని తెలుస్తోంది. ఉజ్వల పథకం కింద గ్యాస్‌ తీసుకున్న వారికి గరిష్టంగా ఈ సబ్సిడీ లభించనుంది. ఇతరులకు  రూ.291.48 వరకు సబ్సిడీ రానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీని పొందాలంటే గ్యాస్‌ వినియోగదారులు కచ్చితంగా బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

సబ్సిడీ పొందాలంటే మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో ఇలా లింక్ చేయండి

  • ఇండనే గ్యాస్ సిలిండర్ కస్టమర్లు  ‘cx.indianoil.in’ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆదార్‌కార్డును లింక్‌ చేయాలి.
  • భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ - ‘ebharatgas.com’సందర్శించి ఆదార్‌కార్డును లింక్‌ చేయాలి.
  • సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా కూడా ఆదార్‌ కార్డును లింక్ చేయవచ్చును.

చదవండి: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్‌బీఐ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top