Tata Motors: చైనాలో లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. చైన్‌ సరఫరాలో ఇబ్బందులు

Lockdown in China may have an adverse impact on sales - Sakshi

సరఫరాలపై చైనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌

టాటా మోటార్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఇటీవల చైనాలోని లాక్‌డౌన్‌ల కారణంగా సరఫరా చైన్‌కు విఘాతాలు ఏర్పడినట్లు దేశీ ఆటోరంగ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా వెల్లడించింది. సరఫరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేసింది. దీంతో ప్రొడక్టులను డెలివరీ చేయడంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలియజేసింది. ఫలితంగా కొన్ని ప్లాంట్లలో లేదా మొత్తంగా ఉత్పత్తి నిలిపివేయవలసిన పరిస్థితులు తలెత్తినట్లు వెల్లడించింది.

మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) వార్షిక నివేదికలో ఇంకా పలు అంశాలు ప్రస్తావించింది. దేశం నుంచి కీలక విడిభాగాల సరఫరాలు లభించకుంటే ఉత్పత్తి నిలిచిపోయేదని వివరించింది. కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్త సెమీకండక్టర్‌ కొరత నేపథ్యంలో పోటీ సంస్థలతో పోలిస్తే టాటా మోటార్స్‌ అత్యధికంగా ప్రభావితమైనట్లు తెలియజేసింది. కోవిడ్‌–19 కట్టడికి చైనాలో విధించిన లాక్‌డౌన్‌లతో అక్కడి కొన్ని ప్రాంతాలలో డీలర్‌షిప్‌లు తాత్కాలికంగా మూత పడినట్లు వెల్లడించింది.

చదవండి: పాపం.. అప్పుల ఊబిలో రెవలాన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top