కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!

LIC Housing Finance offers lowest home loan in festive season - Sakshi

మీరు కొత్త ఇల్లు కొనుగోలుచేయాలని చూస్తున్నారా?, అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) పండుగ సీజన్ ఆఫర్లలో భాగంగా గృహ రుణాలను అతి తక్కువకు(6.66%) అందించనున్నట్లు నేడు ప్రకటించింది. వినియోగదారులు ₹2 కోట్ల వరకు తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలను పొందవచ్చు అని తెలిపింది. నేడు ప్రకటించిన ఈ కొత్త ఆఫర్ సిబిల్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తుంది. వారి వృత్తితో సంబంధం లేకుండా (అంటే వేతన లేదా వృత్తిపరమైన/స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు) రుణాలు మంజూరు చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. 

ఈ ఆఫర్ సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30, 2021 వరకు మంజూరు చేసిన రుణాల మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. గతంలో ఈ ఆఫర్ రూ.50 లక్షల వరకు గృహరుణాలు తీసుకునే వారికి వర్తించేది అని సీఈఓ వై. విశ్వనాథ గౌద్ తెలిపారు. కానీ, ప్రస్తుతం ₹2కోట్ల వరకు రుణాలకు అదే రేటును పొడిగించినట్లు ఆయన తెలిపారు. రుణగ్రహీతలు HomY App ద్వారా గృహ రుణాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోరు గనుక తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంది.(చదవండి: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌, లక్షకు పైగా ఉద్యోగాలకు..)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top